బ్రేకింగ్: ఆర్టీసీ జేఏసీ నేత​ అశ్వత్థామరెడ్డిపై ఫిర్యాదు

| Edited By:

Nov 16, 2019 | 10:36 AM

ఆర్టీసీ యూనియన్ నేత అశ్వత్థామరెడ్డిపై  అంబర్‌పేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. ఆయనతో పాటు ఆర్టీసీ జేఏసీ కో కన్వీనర్ రాజిరెడ్డిలపై మాల మహానాడు అధ్యక్షుడు దీపక్ కుమార్ ఫిర్యాదు చేశారు. ఇంతవరకు ఉదృతంగా సాగిన సమ్మెను.. జేఏసీ నేతలు నీరుగార్చుతున్నారని  దీపక్ కుమార్ ఆరోపించారు. 23 మంది ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నాక.. విలీనం డిమాండ్‌పై వెనక్కి తగ్గడం ఏంటని ప్రశ్నించారు. అందరితో చర్చించే విలీనం ప్రతిపాదనను వాయిదా వేశారా అని ఆయన ప్రశ్నించారు. జేఏసీ […]

బ్రేకింగ్: ఆర్టీసీ జేఏసీ నేత​ అశ్వత్థామరెడ్డిపై ఫిర్యాదు
Follow us on

ఆర్టీసీ యూనియన్ నేత అశ్వత్థామరెడ్డిపై  అంబర్‌పేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. ఆయనతో పాటు ఆర్టీసీ జేఏసీ కో కన్వీనర్ రాజిరెడ్డిలపై మాల మహానాడు అధ్యక్షుడు దీపక్ కుమార్ ఫిర్యాదు చేశారు. ఇంతవరకు ఉదృతంగా సాగిన సమ్మెను.. జేఏసీ నేతలు నీరుగార్చుతున్నారని  దీపక్ కుమార్ ఆరోపించారు. 23 మంది ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నాక.. విలీనం డిమాండ్‌పై వెనక్కి తగ్గడం ఏంటని ప్రశ్నించారు.

అందరితో చర్చించే విలీనం ప్రతిపాదనను వాయిదా వేశారా అని ఆయన ప్రశ్నించారు. జేఏసీ నేతలు వేస్తోన్న అడుగులు చూస్తుంటే..వారు ప్రభుత్వానికి అనుకూలంగా ప్రవర్తిస్తున్నారన్న అనుమానం కలుగుతుందన్నారు. దాదాపు 50,000 మంది ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు తన జీతభత్యాలను వదులుకొని, అనేక కష్టాలకోర్చి సమ్మె చేస్తుంటే.. ఉద్యమ నేతలు తీరు బాధ కల్గిస్తుందని దీపక్ కుమర్ పేర్కొన్నారు. ప్రభుత్వానికి కనువిప్పు కలిగే వరకు ఆర్టీసీ కార్మికుల పక్షాన  మాల మహానాడు, బంజారా,  ఎమ్మార్పీఎస్, గిరిజన, మైనారిటీ సంఘాలు మద్దతుగా నిలిస్తాయని తెలిపారు.