Breaking news: సోనియా గాంధీపై కర్నాటకలో పోలీసు కేసు

|

May 21, 2020 | 2:20 PM

కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీపై కర్నాటకలో పోలీసు కేసు నమోదైంది. పీఎం కేర్స్ నిధిపై ఆమె చేసిన ట్వీట్‌పై ఫిర్యాదు రావడంతో సోనియాగాంధీపై కేసు నమోదు చేశారు.

Breaking news: సోనియా గాంధీపై కర్నాటకలో పోలీసు కేసు
Follow us on

Police case filed against Congress president Sonia Gandhi in Karnataka:  కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీపై కర్నాటకలో పోలీసు కేసు నమోదైంది. పీఎం కేర్స్ నిధిపై ఆమె చేసిన ట్వీట్‌పై ఫిర్యాదు రావడంతో సోనియాగాంధీపై కేసు నమోదు చేశారు. పీఎం కేర్స్ ఫండ్‌ నిర్వహణపై సోనియా గాంధీ అనుచితంగా ట్వీట్ చేశారంటూ వచ్చిన ఫిర్యాదుపై కర్నాటక పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

‘‘పీఎం కేర్స్ నిధి ఆనేది మోసం’’ అని సోనియాగాంధీ ఇటీవల ట్విట్టర్లో ట్వీట్ చేశారు. దీనిని ప్రజల కోసం ఉపయోగించడం లేదని, ఈ నిధిని ఉపయోగించి ప్రధాని విదేశీ పర్యటనలకు వెళుతున్నారని సోనియా గాంధీ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు అసత్యాలని, ప్రధాని మోదీ ప్రతిష్టను భంగపరిచేందుకు తప్పుడు వ్యాఖ్యలు చేశారని కర్నాటకకు న్యాయవాది కెవి ప్రవీణ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో సోనియాగాంధీపై ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేశారు.

కర్నాటకలోని శివమొగ్గలో సోనియాగాంధీపై కేసు నమోదైంది. సోషల్ మీడియా అకౌంట్‌ని ఆమె హ్యాండీల్ చేయడం వలన ఎఫ్ఐఆర్ నమోదు అయినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ మేరకు ఎఫ్.ఐ.ఆర్.లో పేర్కొన్నారు పోలీసులు.