భట్టి దీక్ష భగ్నం..

| Edited By:

Jun 10, 2019 | 8:19 AM

కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఈ తెల్లవారు జామున 5 గంటలకు దీక్ష భగ్నం చేసిన పోలీసులు.. ఆయన్ను నిమ్స్‌కు తరలించారు. టీఆర్ఎస్‌లో సీఎల్పీని విలీనం చేయడాన్ని నిరసిస్తూ మూడురోజులుగా దీక్ష కొనసాగించారు భట్టి. ఇందిరా పార్క్ ధర్నాచౌక్‌లో ఆయన శనివారం నుంచి నిరవధిక నిరసన దీక్షకు దిగారు. భట్టికి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కుంతియా, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం సహా పలువురు సంఘీభావం […]

భట్టి దీక్ష భగ్నం..
Follow us on

కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఈ తెల్లవారు జామున 5 గంటలకు దీక్ష భగ్నం చేసిన పోలీసులు.. ఆయన్ను నిమ్స్‌కు తరలించారు. టీఆర్ఎస్‌లో సీఎల్పీని విలీనం చేయడాన్ని నిరసిస్తూ మూడురోజులుగా దీక్ష కొనసాగించారు భట్టి.

ఇందిరా పార్క్ ధర్నాచౌక్‌లో ఆయన శనివారం నుంచి నిరవధిక నిరసన దీక్షకు దిగారు. భట్టికి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కుంతియా, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం సహా పలువురు సంఘీభావం తెలిపారు.

ప్రజాస్వామ్య పరిరక్షణ సత్యాగ్రమం పేరుతో చేపట్టిన ఈ దీక్ష మొదట 36 గంటలపాటు చేయాలని భావించారు. అయితే ఆ తర్వాత భట్టి నిరవధిక నిరసన దీక్షకు దిగుతున్నట్లు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ ప్రకటించారు. తమ డిమాండ్లను పరిష్కరించే వరకు వెనక్కి తగ్గమని ప్రకటించారు. అయితే ఆయన ఆరోగ్యం క్షీణిస్తోందని వైద్యులు తెలపడంతో తెల్లవారుజామున 5 గంటలకు దీక్ష భగ్నం చేసిన పోలీసులు భట్టిని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు.