మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసుల అరెస్ట్! వైసీపీ ఎమ్మెల్యే హౌస్‌ అరెస్ట్

| Edited By:

Jan 04, 2020 | 12:43 PM

టీడీపీ నేత, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈయనతో పాటు అటు వైసీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ రామచంద్రారెడ్డిని కూడా పోలీసులు హాస్‌ అరెస్ట్ చేశారు. అమరావతి రాజధానిపై కాల్వ శ్రీనివాసులు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమవేశానికి పోలీసులు అనుమతిని నిరాకరించారు. దీంతో.. కాల్వ రోడ్డుపైనే బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తుండగా.. అక్కడకి చేరుకున్న పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసి.. పోలీస్ స్టేషన్‌కి తరలించారు. దీంతో.. ఆ ప్రాంతంలో […]

మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసుల అరెస్ట్! వైసీపీ ఎమ్మెల్యే హౌస్‌ అరెస్ట్
Follow us on

టీడీపీ నేత, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈయనతో పాటు అటు వైసీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ రామచంద్రారెడ్డిని కూడా పోలీసులు హాస్‌ అరెస్ట్ చేశారు. అమరావతి రాజధానిపై కాల్వ శ్రీనివాసులు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమవేశానికి పోలీసులు అనుమతిని నిరాకరించారు. దీంతో.. కాల్వ రోడ్డుపైనే బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తుండగా.. అక్కడకి చేరుకున్న పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసి.. పోలీస్ స్టేషన్‌కి తరలించారు. దీంతో.. ఆ ప్రాంతంలో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. అటు అఖిల పక్ష సమావేశానికి హాజరవుతానంటూ.. రామచంద్రారెడ్డి కూడా ప్రకటించడంతో ఆయన్ని కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.