చిలుకా.. చిలుకా.. ఎందుకలా చెప్పావే..!

| Edited By:

Apr 26, 2019 | 5:10 PM

చిలుక అరెస్ట్.. మీరు చదువుతున్నది నిజమే. నిజంగానే ఓ చిలుకను అరెస్ట్ చేశారు బ్రెజిల్‌ పోలీసులు. అయితే ఆ పక్షిని కావాలనే అరెస్ట్ చేయలేదు. పెద్ద కారణంతోనే చిలుకకు బేడీలను వేశారు పోలీసులు. అసలు చిలుకను అరెస్ట్ చేయడమేంటి..? దానికి కారణమేమిటి అనుకుంటున్నారా..? ఆ విషయాలను తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఈ ఆర్టికల్‌ను చదివేయండి మరి. బ్రెజిల్‌లో స్మగ్లింగ్ ముఠాలను పట్టుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తోన్న పోలీసులకు.. ఓ ఇంట్లో పెద్ద ఎత్తున కొకైన్‌ సరఫరా జరుగుతోందన్న సమాచారం […]

చిలుకా.. చిలుకా.. ఎందుకలా చెప్పావే..!
Follow us on

చిలుక అరెస్ట్.. మీరు చదువుతున్నది నిజమే. నిజంగానే ఓ చిలుకను అరెస్ట్ చేశారు బ్రెజిల్‌ పోలీసులు. అయితే ఆ పక్షిని కావాలనే అరెస్ట్ చేయలేదు. పెద్ద కారణంతోనే చిలుకకు బేడీలను వేశారు పోలీసులు. అసలు చిలుకను అరెస్ట్ చేయడమేంటి..? దానికి కారణమేమిటి అనుకుంటున్నారా..? ఆ విషయాలను తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఈ ఆర్టికల్‌ను చదివేయండి మరి.

బ్రెజిల్‌లో స్మగ్లింగ్ ముఠాలను పట్టుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తోన్న పోలీసులకు.. ఓ ఇంట్లో పెద్ద ఎత్తున కొకైన్‌ సరఫరా జరుగుతోందన్న సమాచారం అందింది.  దీంతో వెంటనే పెద్ద ఎత్తున బలగాలతో ఆ ప్రాంతానికి చేరుకున్నారు. అయితే అప్పటికే అక్కడి నుంచి స్మగ్లర్లు మరోమార్గం ద్వారా పారిపోగా.. లోపలికి వెళ్లిన పోలీసులకు నిరాశే మిగిలింది. ఇది ఎలా జరిగిందని ఆరా తీయగా.. పోలీసులకు షాకింగ్ విషయం తెలిసింది. అదేంటంటే వారి రాకను ముందే పసిగట్టిన అక్కడున్న చిలుక ‘మమ్మా.. పోలీస్’ అంటూ అరిచిందట. వెంటనే అప్రమత్తమైన స్మగ్లర్లు అక్కడి నుంచి తప్పించుకున్నారట. దీంతో నేరస్థులకు సహకరించిందన్న అభియోగంపై ఆ చిలుకను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు పోలీసులు.

కాగా ఆ తరువాత విచారణలో ఆ చిలుక నోరు మాత్రం మెదపలేదట. దాన్ని వదిలేయాలంటూ పర్యావరణ, పక్షి ప్రేమికుల నుంచి డిమాండ్లు రావడంతో చేసేదేమీలేక స్థానిక జంతుప్రదర్శనశాలకు అప్పగించారట పోలీసులు. అయితే 2010లో కొలంబియాలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. పోలీసులు ఓ ఇంటి మీద రైడ్ చేయడంతో తన యజమానికి ‘రన్ రన్’ అంటూ ఓ చిలుక సంకేతాలిచ్చింది.