ఎట్టకేలకు పట్టుబడ్డాడు.. పోలీసుల అదుపులో రవి శేఖర్

| Edited By:

Jul 30, 2019 | 10:39 AM

హైదరాబాద్‌ హయత్‌నగర్‌లో సోని అనే విద్యార్థిని కిడ్నాప్ చేసిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, కిడ్నాపర్ రవి శేఖర్ ఎట్టకేలకు పట్టుబడ్డాడు. ఏపీ పోలీసుల సహకారంతో ఒంగోలులో అతడిని అదుపులోకి తీసుకున్నారు తెలంగాణ పోలీసులు. ప్రస్తుతం అతడు రాచకొండ పోలీసుల అదుపులో ఉన్నాడు. కాగా రవి శేఖర్‌పై తెలుగు రాష్ట్రాలు సహా నాలుగు ఇతర రాష్ట్రాల్లో పలు కేసులున్నాయి. అయితే వారం రోజుల క్రితం ఉద్యోగం ఇప్పిస్తానని మాటలు చెప్పి సోనిని రవి శేఖర్ కిడ్నాప్ చేసిన విషయం […]

ఎట్టకేలకు పట్టుబడ్డాడు.. పోలీసుల అదుపులో రవి శేఖర్
Follow us on

హైదరాబాద్‌ హయత్‌నగర్‌లో సోని అనే విద్యార్థిని కిడ్నాప్ చేసిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, కిడ్నాపర్ రవి శేఖర్ ఎట్టకేలకు పట్టుబడ్డాడు. ఏపీ పోలీసుల సహకారంతో ఒంగోలులో అతడిని అదుపులోకి తీసుకున్నారు తెలంగాణ పోలీసులు. ప్రస్తుతం అతడు రాచకొండ పోలీసుల అదుపులో ఉన్నాడు. కాగా రవి శేఖర్‌పై తెలుగు రాష్ట్రాలు సహా నాలుగు ఇతర రాష్ట్రాల్లో పలు కేసులున్నాయి. అయితే వారం రోజుల క్రితం ఉద్యోగం ఇప్పిస్తానని మాటలు చెప్పి సోనిని రవి శేఖర్ కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. ఆమెను అద్దంకిలో వదిలేయగా.. తాజాగా హైదరాబాద్‌కు తీసుకొచ్చారు.