ఏపీ ప్రభుత్వానికి షాక్: హైకోర్టును ఆశ్రయించిన నవయుగ..తేలనున్న..!

| Edited By:

Aug 20, 2019 | 8:14 AM

గత కొన్ని రోజులుగా పోలవరం ప్రాజెక్టుపై రచ్చ జరుగుతూనే వుంది. తెలుగు తమ్ముళ్లు.. పోలవరం ప్రాజెక్టును అడ్డంగా పెట్టుకుని డబ్బులు వెనకేసుకున్నారని అధికార పక్ష నేతలతో సహా ఏకంగా సీఎం జగన్‌నే విమర్శించారు. ఈ సందర్భంగా.. టీడీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నవయుగ కాంట్రాక్టును రద్దు చేస్తూ.. వైసీపీ సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో.. పని అయిపోయింది.. రివర్స్ టెండర్స్ వేయాలంటూ అంటూ ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయంలో జగన్ ప్రభుత్వంపై ఒక రేంజ్‌లో ఘాటు విమర్శలు […]

ఏపీ ప్రభుత్వానికి షాక్: హైకోర్టును ఆశ్రయించిన నవయుగ..తేలనున్న..!
Follow us on

గత కొన్ని రోజులుగా పోలవరం ప్రాజెక్టుపై రచ్చ జరుగుతూనే వుంది. తెలుగు తమ్ముళ్లు.. పోలవరం ప్రాజెక్టును అడ్డంగా పెట్టుకుని డబ్బులు వెనకేసుకున్నారని అధికార పక్ష నేతలతో సహా ఏకంగా సీఎం జగన్‌నే విమర్శించారు. ఈ సందర్భంగా.. టీడీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నవయుగ కాంట్రాక్టును రద్దు చేస్తూ.. వైసీపీ సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో.. పని అయిపోయింది.. రివర్స్ టెండర్స్ వేయాలంటూ అంటూ ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయంలో జగన్ ప్రభుత్వంపై ఒక రేంజ్‌లో ఘాటు విమర్శలు కూడా వచ్చాయి. ఈ విషయం పక్కన పెడితే.. తాజాగా.. నవయువ కాంట్రాక్ట్ కంపెనీ.. ఏపీ ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది.

పోలవరం కాంట్రాక్టును రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టును ఆశ్రయించింది నవయుగ కంపెనీ. అర్థాంతరంగా కాంట్రాక్ట్ రద్దు వల్ల తమ సంస్థ పరువు, ప్రతిష్టకు భంగం కలిగిందని ఆరోపిస్తూ.. హైకోర్టులో పిటిషన్‌లో వేయనున్నారు. పనులు వేగంగా చేస్తున్న సంస్థని పక్కన పెట్టి.. రివర్స్ టెండరింగ్‌కి వెళ్లడాన్ని వ్యతిరేకిస్తూ.. ‌పోలవరం పనులు తమనే కొనసాగించేలా ఆదేశాలివ్వాలని ఈ రోజు హైకోర్టులో పిటిషన్ వేయనుంది నవయుగ కంపెనీ.