‘కాల భైరవుడి సాక్షి’గా మోదీ నామినేషన్

| Edited By:

Apr 26, 2019 | 4:56 PM

వారణాసి నుంచి ప్రధాని నరేంద్రమోదీ తన నామినేషన్‌ను దాఖలు చేశారు. అక్కడి కలెక్టర్ కార్యాలయానికి వెళ్లిన ఆయన.. నామినేషన్ పత్రాలను అధికారులకు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన వెంట బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, శివసేన చీఫ్ ఉద్దవ్ థాకరే, తమిళనాడు ఉపముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, లోక్‌జన్‌శక్తి అధ్యక్షుడు రామ్ విలాస్ పాశ్వాన్, శిరోమణి అకాలీదల్ నేత ప్రకాశ్ సింగ్  ఉన్నారు. అంతకుముందు కాల భైరవ ఆలయంలో మోదీ పూజలు నిర్వహించారు. కాగా వారణాసి నుంచి ఆయన […]

‘కాల భైరవుడి సాక్షి’గా మోదీ నామినేషన్
Follow us on

వారణాసి నుంచి ప్రధాని నరేంద్రమోదీ తన నామినేషన్‌ను దాఖలు చేశారు. అక్కడి కలెక్టర్ కార్యాలయానికి వెళ్లిన ఆయన.. నామినేషన్ పత్రాలను అధికారులకు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన వెంట బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, శివసేన చీఫ్ ఉద్దవ్ థాకరే, తమిళనాడు ఉపముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, లోక్‌జన్‌శక్తి అధ్యక్షుడు రామ్ విలాస్ పాశ్వాన్, శిరోమణి అకాలీదల్ నేత ప్రకాశ్ సింగ్  ఉన్నారు. అంతకుముందు కాల భైరవ ఆలయంలో మోదీ పూజలు నిర్వహించారు. కాగా వారణాసి నుంచి ఆయన రెండోసారి లోక్‌సభ స్థానానికి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.