‘చౌకీదార్‌’ను తొలగించిన మోదీ…

| Edited By:

May 23, 2019 | 7:21 PM

2019 లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉపయోగించిన ‘చౌకీదార్’ అనే పదం చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. తాను ఈ దేశాన్ని కాపాడే చౌకీదార్(కాపలాదారుడు) అని మోదీ తన ప్రతీ ప్రసంగంలోనూ చెప్పుకుంటూ వచ్చారు. అంతేకాక.. ప్రధాన బీజేపీ నేతలు, బీజేపీ మద్దతుదారులు అంతా తమ ట్విట్టర్ పేర్ల ముందు ‘చౌకీదార్’ అని పదాన్ని జత చేసుకున్నారు. తాజాగా… మోదీ తన పేరు నుంచి చౌకీదార్ అనే పదాన్ని తొలగించారు. ‘‘భారతదేశ ప్రజలు చౌకీదార్లుగా […]

‘చౌకీదార్‌’ను తొలగించిన మోదీ...
Follow us on

2019 లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉపయోగించిన ‘చౌకీదార్’ అనే పదం చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. తాను ఈ దేశాన్ని కాపాడే చౌకీదార్(కాపలాదారుడు) అని మోదీ తన ప్రతీ ప్రసంగంలోనూ చెప్పుకుంటూ వచ్చారు. అంతేకాక.. ప్రధాన బీజేపీ నేతలు, బీజేపీ మద్దతుదారులు అంతా తమ ట్విట్టర్ పేర్ల ముందు ‘చౌకీదార్’ అని పదాన్ని జత చేసుకున్నారు.

తాజాగా… మోదీ తన పేరు నుంచి చౌకీదార్ అనే పదాన్ని తొలగించారు. ‘‘భారతదేశ ప్రజలు చౌకీదార్లుగా మారి దేశానికి ఎంతో సేవ చేశారు. చౌకీదార్ అతి పెద్ద శక్తిగా అవతరించి దేశాన్ని కుల, మత కలహాలు, అవినీతి తదితర దుష్టశక్తుల నుంచి కాపాడింది’’ అంటూ మోదీ ట్వీట్ చేశారు. ఇక తన పేరు నుంచి చౌకీదార్ అనే పదాన్ని తొలగిస్తున్నానని.. అంతేకాని చౌకీదార్ అనే పదం ఎల్లప్పుడు తన మదిలోనే ఉంటుందని మోదీ అన్నారు.