నెల్లూరులో ఫ్లెక్సీల రాజకీయం.. వైసీపీలో అంతర్గతపోరు చల్లారకముందే బీజేపీ రచ్చ, పార్టీకో రూలా అంటూ ప్రశ్న

|

Dec 26, 2020 | 3:11 PM

నెల్లూరులో ప్రస్తుతం ఫ్లెక్సీల రాజకీయం నడుస్తోంది. వైసీపీలో అంతర్గత వివాదం చల్లారకముందే.. మరోసారి ఫ్లెక్సీల గొడవ రాజుకుంది...

నెల్లూరులో ఫ్లెక్సీల రాజకీయం..  వైసీపీలో అంతర్గతపోరు చల్లారకముందే బీజేపీ రచ్చ, పార్టీకో రూలా అంటూ ప్రశ్న
Follow us on

నెల్లూరులో ప్రస్తుతం ఫ్లెక్సీల రాజకీయం నడుస్తోంది. వైసీపీలో అంతర్గత వివాదం చల్లారకముందే.. మరోసారి ఫ్లెక్సీల గొడవ రాజుకుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు పర్యటన సందర్భంగా…పార్టీ శ్రేణులు ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలను నగరపాలకసంస్థ అధికారులు తొలగించారు. దీనిపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. అధికారపార్టీనేతల ఫ్లెక్సీలకు లేని అభ్యంతరం తమ పార్టీ ఫ్లెక్సీలపై ఎందుకని ప్రశ్నించారు. ఎల్లకాలం ఎవరూ అధికారంలో ఉండరని, అధికారపార్టీ నేతలు ఆ విషయం గుర్తుంచుకోవాలంటున్నారు. ఆనం వివేకానందరెడ్డి జయంతి సందర్భంగా ఏర్పాటుచేసిన ఫ్లెక్సీల తొలగింపుపై రెండ్రోజులక్రితం వివాదం రేగిన సంగతి తెలిసిందే. దీనిపై మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కుమారుడు తీవ్రంగా స్పందించటంతో…జిల్లా మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌ వివరణ ఇచ్చారు. ఆ ఇష్యూతో వైసీపీలో అంతర్గత వివాదాలు బయటపడ్డాయి. ఇప్పుడు ఫ్లెక్సీల తొలగింపుతో బీజేపీ-వైసీపీల మధ్య వివాదం రాజుకుంది. పార్టీకో రూల్‌ ఉంటుందా అని ప్రశ్నిస్తున్నారు నెల్లూరు బీజేపీ నేతలు. నిబంధనలు అందరికీ ఒకేలా ఉండాలంటున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పర్యటనపై ముందే అధికారులకు సమాచారం ఇచ్చినా… ఫ్లెక్సీలు తొలగించడాన్ని నెల్లూరు కమలం పార్టీ నేతలు తప్పుపడుతున్నారు.