దొంగ బాబాలు, ఆశ్రమాలకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు…

|

Jul 08, 2020 | 3:40 PM

దొంగ బాబాలు, ఆశ్రమాలకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. యాక్షన్ టేకెన్ రిపోర్ట్ సమర్పించాల్సిందిగా కేంద్రాన్ని ఆదేశించింది. 2 వారాల్లో సమగ్ర నివేదిక అందించాలన్న సూచించింది.

దొంగ బాబాలు, ఆశ్రమాలకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు...
Follow us on

దొంగ బాబాలు, ఆశ్రమాలకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. యాక్షన్ టేకెన్ రిపోర్ట్ సమర్పించాల్సిందిగా సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ ను ఆదేశించింది. 2 వారాల్లో సమగ్ర నివేదిక అందించాలన్న సూచించింది. దొంగబాబాలు, ఆశ్రమాలపై హైదరాబాద్ ‌వాసి దుంపల రామిరెడ్డి దాఖలు చేసిన పిల్ పై కోర్టు ఈ మేర‌కు ఆదేశాలు జారీ చేసింది. ఎలాంటి నియమ, నిబంధనలు పాటించ‌కుండా దొంగ‌బాబాలు చట్ట వ్యతిరేక కార్యాకలాపాలు జరుగుతున్నాయని పిటిషన్ లో పేర్కొన్నారు రామిరెడ్డి. కోవిడ్-19 నేపథ్యంలో ఆశ్రమాల్లో వైరస్ వ్యాప్తికి ఆస్కారం ఉందని వివ‌రించారు. అమెరికాలో పీ.హెచ్.డి చేసిన తన కుమార్తెను సైతం ఆశ్రమ నిర్వాహకులు ట్రాప్ చేశారని ఆరోపించారు.

కాగా అత్యాచార ఆరోపణలున్న వీరేంద్ర దీక్షిత్ నేతృత్వంలోని ఆధ్యాత్మిక కేంద్రంలో రామిరెడ్డి కుమార్తె బందీగా ఉంది. రామిరెడ్డి పిటిషన్ నేపథ్యంలో దొంగ ఆశ్రమాలపై ఆలిండియా అఖాడా పరిషత్ కోర్టుకు వివరణ ఇచ్చింది. ఆశారాం బాపు, రామ్ రహీమ్ సింగ్, వీరేంద్ర దీక్షిత్ సహా మొత్తం 17 మంది దొంగ బాబాలు, ఆశ్రమాల వివరాలు అందించింది. మూడేళ్లుగా వీరేంద్ర దీక్షిత్ అజ్ఞాతంలో ఉన్నట్లు తెలిపింది. దొంగ ఆశ్రమాలపై నివేదిక ప‌రిశీలించిన అత్యున్న‌త ధ‌ర్మాస‌నం..సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ ను యాక్షన్ టేకెన్ రిపోర్ట్ స‌మ‌ర్పించాల‌ని ఆదేశించింది.