పాపం మృగరాజులు..ఆకలితో అలమటిస్తూ..చివరికి

|

Jan 21, 2020 | 10:20 PM

సింహాలు చూడటానికి సాలిడ్‌గా ఉంటాయి. బోనులో ఉన్నా బయట ఉన్నా సింగం..సింగమే. ఒక్కసారి పంజా విసిరితే..దాన్ని దాటి తప్పించుకోవడం అంత ఈజీ కాదు. అడవిని శాసించే మృగరాజులకు సుడాన్ రాజధాని ఖార్టూమ్‌లోని అల్-ఖురేషి జూ పార్కులో ఊహించని కష్టాలు ఎదురయ్యాయి. కొన్ని వారాలుగా అవి ఆకలితో అలమటిస్తున్నాయి. కనీసం ఆనారోగ్యంతో ఉంటే మందులు కూడా ఇవ్వడం లేదు. దీంతో అవన్నీ బక్కచిక్కిపోయి..ఎముకల గూడుతో దర్శనమిస్తున్నాయి. కొన్ని సింహాలకైతే ఎముకలు శరీరాన్ని చీల్చుకుని బయటకు వస్తున్నాయి. మొత్తం ఐదు […]

పాపం మృగరాజులు..ఆకలితో అలమటిస్తూ..చివరికి
Follow us on

సింహాలు చూడటానికి సాలిడ్‌గా ఉంటాయి. బోనులో ఉన్నా బయట ఉన్నా సింగం..సింగమే. ఒక్కసారి పంజా విసిరితే..దాన్ని దాటి తప్పించుకోవడం అంత ఈజీ కాదు. అడవిని శాసించే మృగరాజులకు సుడాన్ రాజధాని ఖార్టూమ్‌లోని అల్-ఖురేషి జూ పార్కులో ఊహించని కష్టాలు ఎదురయ్యాయి. కొన్ని వారాలుగా అవి ఆకలితో అలమటిస్తున్నాయి. కనీసం ఆనారోగ్యంతో ఉంటే మందులు కూడా ఇవ్వడం లేదు. దీంతో అవన్నీ బక్కచిక్కిపోయి..ఎముకల గూడుతో దర్శనమిస్తున్నాయి. కొన్ని సింహాలకైతే ఎముకలు శరీరాన్ని చీల్చుకుని బయటకు వస్తున్నాయి. మొత్తం ఐదు సింహాలు ఈ ఇబ్బందిని ఎదుర్కొంటున్నాయి. వాటిలో ఒకటి ఇటీవలే మరణించడం విచారకర విషయం.

ఉస్మాన్ సలీహ్ అనే వ్యక్తి వాటి పరిస్థితిని చూసి చలించిపోయాడు. వెంటనే ఫోటోలు తీసి..ఫేస్‌బుక్‌లో షేర్ చేసి సాయం చేయాల్సిందిగా అభ్యర్థించాడు. దీంతో ఆ ఫోటోలు వైరల్ అయ్యాయి. సింహాల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు ప్రజలు పార్క్‌కు క్యూ కట్టారు. వాటికి మాంసం, మందులు, మెడికల్ ఎక్విప్‌మెంట్స్ అందజేశారు. ప్రస్తుతం సింహాలు కోలుకుంటున్నాయి. దీంతో సలీహ్ చేసిన కృషిని ప్రశంసిస్తున్నారు నెటిజన్లు. వాటి ఆరోగ్య పరిస్థితి ఎప్పటికప్పుడు తెలియజేయాల్సిందిగా ఆయన్ను కోరుతున్నారు.

పార్క్ నిర్వాహకులు కూడా సింహాల పరిస్థితిపై స్పందించారు. “ఆహారం ఎల్లప్పుడూ అందుబాటులో ఉండదు. కాబట్టి, తరచూ వాటిని తినిపించడానికి మా సొంత డబ్బు నుండి కొనుగోలు చేస్తాము. కానీ అన్నిసార్లు అలా వీలుపడటం లేదు” అని పార్క్ వద్ద మేనేజర్ ఎస్సామెల్డిన్ హజ్జర్ చెప్పారు.