గుడ్ న్యూస్ చెప్పిన ఫైజర్‌… తమ వ్యాక్సిన్‌ 95 శాతం సేఫ్ అని కీలక ప్రకటన‌

|

Nov 18, 2020 | 7:44 PM

కరోనా వ్యాక్సిన్‌పై ఫార్మా దిగ్గజం ఫైజర్‌ కీలక ప్రకటన చేసింది. తాము తయారు చేసిన వ్యాక్సిన్‌ 95 శాతం సేఫ్‌ అని ఫైజర్‌ ప్రకటించింది. తుది దశ క్లినికల్‌ ట్రయల్స్‌ వివరాలను ఫైజర్‌ సంస్థ ఈయూకి అందించింది.

గుడ్ న్యూస్ చెప్పిన ఫైజర్‌... తమ వ్యాక్సిన్‌ 95 శాతం సేఫ్ అని కీలక ప్రకటన‌
Follow us on

Pfizer Says Vaccine 95 per cent Effective : కరోనా వ్యాక్సిన్‌పై ఫార్మా దిగ్గజం ఫైజర్‌ కీలక ప్రకటన చేసింది. తాము తయారు చేసిన వ్యాక్సిన్‌ 95 శాతం సేఫ్‌ అని ఫైజర్‌ ప్రకటించింది. తుది దశ క్లినికల్‌ ట్రయల్స్‌ వివరాలను ఫైజర్‌ సంస్థ ఈయూకి అందించింది. అమెరికాలో అత్యవసర పరిస్థితుల్లో వ్యాక్సిన్‌ను ఉపయోగించేందుకు ప్రభుత్వ అనుమతిని కోరినట్టు ఫైజర్‌ వెల్లడిచింది. క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించిన వాలంటీర్లలో ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ కన్పించలేదని ఫైజర్‌ స్పష్టం చేసింది.

అయితే భారత్‌లో మాత్రం ఫైజర్‌ వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చే అవకాశాలు కన్పించడం లేదు. మైనస్‌ 70 డిగ్రీల ఉష్ణోగ్రతల్లో ఈ వ్యాక్సిన్‌ డోస్‌లను నిల్వ చేయాల్సి ఉంటుంది. అలాంటి ఫెసిలిటీ భారత్‌లో లేదు. అయితే ఫైజర్‌ వ్యాక్సిన్‌ను దేశ ప్రజలకు అందుబాటులోకి తెచ్చే విషయంపై ఇంకా చర్చలు జరుగుతున్నాయని కోవిడ్‌ నేషనల్‌ టాస్క్‌ఫోర్స్‌ సభ్యుడు వీకే పాల్‌ తెలిపారు.