‘పెట్రో’ మంట.. వరుసగా 16వ రోజు ధరలు పైపైకి..

|

Jun 22, 2020 | 9:06 AM

వాహనదారులకు షాకిస్తూ వరుసగా 16వ రోజు పెట్రోల్, డీజల్ ధరలు పెరిగాయి. డీజల్‌పై 58 పైసలు, పెట్రోల్‌పై 33 పైసల చొప్పున చమురు సంస్థలు వడ్డించాయి.

పెట్రో మంట.. వరుసగా 16వ రోజు ధరలు పైపైకి..
Follow us on

వాహనదారులకు షాకిస్తూ వరుసగా 16వ రోజు పెట్రోల్, డీజల్ ధరలు పెరిగాయి. డీజల్‌పై 58 పైసలు, పెట్రోల్‌పై 33 పైసల చొప్పున చమురు సంస్థలు వడ్డించాయి. దీనితో దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర రూ. 79.56 కాగా, డీజల్ రూ. 78.85కు చేరింది. ఇక వరుసగా 16 రోజుల్లో పెట్రోల్ ధర లీటర్‌కు రూ. 8.36 పెరగగా.. డీజిల్ ధర లీటరుకు రూ. 9.43కు ఎగిసింది. 12 వారాల లాక్ డౌన్ అనంతరం చమురు సంస్థలు తమ నష్టాలను పూడ్చుకునేందుకు ధరలను ప్రతీరోజూ పెంచుతూ వస్తున్నాయి. అసలే కరోనా కాలం, ఆపై అంతంత మాత్రంగా వస్తోన్న ఆదాయం.. ఇలాంటి తరుణంలో పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచడమేంటని సామాన్యులు గగ్గోలు పెడుతున్నారు. కాగా, జూన్ 7వ తేదీ నుంచి 82 రోజుల షట్ డౌన్ తర్వాత చమురు సంస్థలు మళ్లీ తిరిగి ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇక అప్పటి నుంచి ప్రజలపై వరుసగా పెట్రోల్ ధరల భారం పడుతూనే ఉంది.

మెట్రో నగరాల్లో రేట్లు ఇలా ఉన్నాయి…

  • ఢిల్లీ – పెట్రోల్ రూ. 79.56, డీజిల్ రూ. 78.85
  • కోల్‌కతా – పెట్రోల్ రూ. 81.27, డీజిల్ రూ. 74.14
  • ముంబై – పెట్రోల్ రూ. 86.36, డీజిల్ రూ. 77.24
  • చెన్నై – పెట్రోల్ రూ. 82.87, డీజిల్ రూ. 76.30