మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు..

|

Jun 29, 2020 | 9:53 AM

ఆదివారం సామాన్యులకు కాస్త ఊరటను ఇచ్చి.. మరోసారి పెంపును చమురు సంస్థలు పెంచాయి. తాజాగా పెట్రోల్‌పై లీటర్‌కు 05 పైసలు, డీజిల్‌పై 12 పైసలు పెంచుతూ..

మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు..
Follow us on

పెట్రోల్, డీజిల్ ధరలను చమురు సంస్థలు మళ్లీ పెంచాయి. సుమారు మూడు నెలల లాక్ డౌన్ అనంతరం ఈ నెల 7వ తేదీ నుంచి వరుసగా 22 రోజులపాటు పెట్రోల్, డీజిల్ రేట్లు పెరుగుతూనే వచ్చాయి. ఆదివారం సామాన్యులకు కాస్త ఊరటను ఇచ్చి.. మరోసారి పెంపును మొదలుపెట్టాయి. తాజాగా పెట్రోల్‌పై లీటర్‌కు 05 పైసలు, డీజిల్‌పై 12 పైసలు పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. దీనితో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 80.43, లీటర్ డీజిల్ ధర రూ.80.53కి చేరింది. దీంతో ఇప్పటివరకు డీజిల్‌పై రూ.11.14, పెట్రోల్‌పై రూ.9.17 పైసల చొప్పున పెరిగాయి. కాగా, దేశంలో మొదటిసారిగా డీజిల్ ధరలు పెట్రోల్ ధరలను దాటేశాయి. ఇక హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 83.49, డీజిల్ రూ. 78.69గా ఉన్నాయి.