ఇది విన్నారా.. మంచినీరు తాగే నీళ్ల బావిలో పెట్రోల్..!

| Edited By: Pardhasaradhi Peri

Dec 16, 2019 | 12:46 PM

ఓ ఇంటిలోని మంచినీరు తాగే నీళ్ల బావి ఒక్కసారిగా పెట్రోల్‌మయం అయిపోయింది. ఏంటి షాక్ అయ్యారా..? సాధారణంగా పెట్రోల్ బావులు దుబాయ్‌లో ఉంటాయి కదా అని ఆలోచిస్తున్నారా? అవును నిజమే కానీ.. ఇది చూస్తే మీరూ అవుననే అంటారు. మొదట ఇది చూసి.. ఆ ఇంటి కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఈ వార్త ఆనోటా ఈనోటా.. చేరి వైరల్ అయింది. ఇది విన్న ఆ ప్రాంతంలోని జనాలు.. ఆ ఇంటికి క్యూ కట్టారు. ఈ […]

ఇది విన్నారా.. మంచినీరు తాగే నీళ్ల బావిలో పెట్రోల్..!
Follow us on

ఓ ఇంటిలోని మంచినీరు తాగే నీళ్ల బావి ఒక్కసారిగా పెట్రోల్‌మయం అయిపోయింది. ఏంటి షాక్ అయ్యారా..? సాధారణంగా పెట్రోల్ బావులు దుబాయ్‌లో ఉంటాయి కదా అని ఆలోచిస్తున్నారా? అవును నిజమే కానీ.. ఇది చూస్తే మీరూ అవుననే అంటారు. మొదట ఇది చూసి.. ఆ ఇంటి కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఈ వార్త ఆనోటా ఈనోటా.. చేరి వైరల్ అయింది. ఇది విన్న ఆ ప్రాంతంలోని జనాలు.. ఆ ఇంటికి క్యూ కట్టారు. ఈ ఘటన కర్ణాటక కర్వార్ నగరంలోని.. నాగవేణి ఆచారి అనే మహిళ ఇంటిలో వెలుగుచూసింది. రోజూలాగే.. బావిలో నీళ్లు తోడింది. అయితే ఆ నీళ్లు చూసి ఆమెతో పాటు కుటుంబ సభ్యులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు.

నీళ్ల వాసన, రంగు సేమ్ పెట్రోల్‌ మాదిరిగా ఉండటంతో.. ఆ నీళ్లను ల్యాబ్ టెస్ట్‌కు పంపించారు. పరీక్షలో పెట్రోల్‌.. బావిలో కలవడం వల్ల ఇలా జరిగిందని తేలింది. అయితే.. మరో వారం రోజుల తర్వాత పెట్రోల్ వాసన మరీ ఎక్కువగా మొదలైంది. నీళ్లూ కూడా పూర్తిగా ఎరుపురంగులోకి మారిపోయాయి. ఇది చూసి కంగారు పడిన వారు మళ్లీ స్థానిక అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు తనిఖీలు నిర్వహించగా.. నాగవేణి ఇంటి సమీపంలోని పెట్రోల్ బంకు నుంచి పెట్రోల్ లీక్ అవుతుండడమే కారణమని తేలింది. దీంతో.. ఆ ప్రాంతంలోని వారు కూడా ఊపిరి పీల్చుకున్నారు.