Petrol Diesel Prices: మరోసారి భగ్గుమన్న చమురు ధరలు.. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ఎంతంటే.!

|

Jan 18, 2021 | 11:44 AM

Petrol Diesel Prices: దేశంలో చమురు ధరలు మరోసారి స్వల్పంగా పెరిగాయి. సోమవారం పెట్రోల్, డీజిల్‌పై 25 పైసలు చొప్పున పెంచుతూ...

Petrol Diesel Prices: మరోసారి భగ్గుమన్న చమురు ధరలు.. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ఎంతంటే.!
Petrol Price Today
Follow us on

Petrol Diesel Prices: దేశంలో చమురు ధరలు మరోసారి స్వల్పంగా పెరిగాయి. సోమవారం పెట్రోల్, డీజిల్‌పై 25 పైసలు చొప్పున పెంచుతూ దేశీయ చమురు విక్రయ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. దేశ రాజధాని ఢిల్లీకి లీటర్ పెట్రోల్ ధర 84.95కి చేరింది. డీజిల్ ధర రూ. 75.13కి పెరిగింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్‌ పెట్రల్‌ ధర రూ. 91.56 ఉండగా డీజీల్‌ రూ. 81.87గా ఉంది. చెన్నైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 87.63 ఉండగా డీజీల్‌ ధర రూ. 80.43గా ఉంది.

ఇక తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌, డీజిల్ ధరలు 26 పైసలు చొప్పున పెరిగాయి. దీనితో పెట్రోల్ ధర లీటర్ రూ. 88.37గా ఉండగా.. డీజీల్‌ ధర 81.99గా నమోదైంది. ఇక వరంగల్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.87.92 కాగా డీజీల్‌ 81.56గా ఉంది. ఆంధ్రప్రదేశ్‌ విషయానికొస్తే.. విజయవాడలో లీటర్‌ పెట్రోల్‌ రూ. 91.04 ఉండగా డీజీల్‌ రూ. 84.18గా నమోదైంది. గుంటూరులో పెట్రోల్‌ లీటర్‌ ధర రూ. 90.90 కాగా.. డీజీల్‌ ధర రూ. 84.04గా ఉంది. అటు విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 90.40 కాగా.. డీజిల్ రూ. 83.54కు చేరింది.