పవన్ ఫ్యామిలీ గురించి అలా అంటారా? చంద్రబాబు షాక్!!

| Edited By: Srinu

Dec 10, 2019 | 1:52 PM

ఏపీని ఇప్పుడు ప్యామిలీ పాలిటిక్స్ ఉర్రూతలూగిస్తున్నాయి. సాక్షాత్తు అధినేతల నోటే ఫ్యామిలీల గురించి హాట్ హాట్ కామెంట్లు వినిపిస్తున్నాయి. సోమవారం ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ వింటర్ సెషన్‌లో ముఖ్యమంత్రి జగన్ చేసిన కామెంట్‌పై విపక్ష నేత చంద్రబాబు మండిపడుతున్నారు. సభలో లేని పవన్ కల్యాణ్‌పైన అధికార పార్టీ సభ్యులు చేస్తున్న కామెంట్లు జుగుప్స పుట్టిస్తున్నాయని చంద్రబాబు అంటున్నారు. సోమవారం సభ ముగిసిన తర్వాత చంద్రబాబు విలేకరులతో మాట్లాడారు. తనపైనా, తన కుటుంబంపైనా.. అటు సభలో లేని పవన్‌పైనా, […]

పవన్ ఫ్యామిలీ గురించి అలా అంటారా? చంద్రబాబు షాక్!!
Follow us on

ఏపీని ఇప్పుడు ప్యామిలీ పాలిటిక్స్ ఉర్రూతలూగిస్తున్నాయి. సాక్షాత్తు అధినేతల నోటే ఫ్యామిలీల గురించి హాట్ హాట్ కామెంట్లు వినిపిస్తున్నాయి. సోమవారం ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ వింటర్ సెషన్‌లో ముఖ్యమంత్రి జగన్ చేసిన కామెంట్‌పై విపక్ష నేత చంద్రబాబు మండిపడుతున్నారు.

సభలో లేని పవన్ కల్యాణ్‌పైన అధికార పార్టీ సభ్యులు చేస్తున్న కామెంట్లు జుగుప్స పుట్టిస్తున్నాయని చంద్రబాబు అంటున్నారు. సోమవారం సభ ముగిసిన తర్వాత చంద్రబాబు విలేకరులతో మాట్లాడారు. తనపైనా, తన కుటుంబంపైనా.. అటు సభలో లేని పవన్‌పైనా, పవన్ కుటుంబంపైనా అధికార పార్టీ సభ్యులు అసభ్యంగా మాట్లాడుతున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా జీవితంలో పవన్ కల్యాణ్ ఎవరికీ అన్యాయం చెయ్యలేదని, పవన్ కారెక్టర్‌పై సీఎం జగన్ అహంభావంతో కామెంట్లు చేస్తున్నారని బాబు ఆరోపించారు.

అసెంబ్లీని ఏకపక్షంగా నిర్వహిస్తున్నారని, టిడిపి సభ్యులు అడిగిన ప్రశ్నలపై ఎదురుదాడి చేశారని చంద్రబాబు ఆరోపించారు. పీపీఏల విషయంలో జాతీయ స్థాయిలో ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు పట్టారని ఆయన తెలిపారు. ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నిచాలంటే తమకు మైక్ కూడా ఇవ్వడం లేదని, గడచిన ఆరు నెలల కాలంలో పీపీఏలలో ఏం అవినీతి తేల్చారని చంద్రబాబు ప్రశ్నించారు.

ఉల్లి కోసం క్యూ లైన్‌లో నిలబడి ప్రాణాలు కోల్పోయిన ఘటనపై ప్రభుత్వం ఎందుకు ప్రకటన చెయ్యలేదని చంద్రబాబు నిలదీశారు. మా జిల్లాలో అరాచక శక్తులు ఉన్నాయని అధికార పార్టీ సభ్యుడే అంటుంటే జగన్ ప్రభుత్వానికి చీమకుట్టినట్టైనా లేదని ఆయన విమర్శించారు. అధికార పార్టీకి చెందిన ఓ ఎంపీపై అత్యాచారం కేసు ఉందన్న ఆరోపణపై ఎందుకు సమాధానం చెప్పడం లేదని నిలదీశారు విపక్ష నేత.