Pawan Kalyan : మా లెక్క మాకుంది.. బీజేపీ-వైసీపీ దోస్తీపై పవన్ కామెంట్

|

Feb 15, 2020 | 1:34 PM

వైసీపీ-బీజేపీ మధ్య స్నేహం చిగురిస్తుందన్న ఊహాగానాల నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు.

Pawan Kalyan : మా లెక్క మాకుంది.. బీజేపీ-వైసీపీ దోస్తీపై పవన్ కామెంట్
Follow us on

Pawan Kalyan clarifies YCP-BJP friendship: ఏపీలో వైసీపీ-బీజేపీ జత కడుతున్నాయంటూ జోరుగా జరుగుతున్న ప్రచారంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తనదైన శైలిలో స్పందించారు. రాజధాని ఏరియాలోని గ్రామాల్లో పర్యటిస్తున్న పవన్ కల్యాణ్.. బీజేపీ అధికారపార్టీతో జతకడితే మీరేం చేస్తారంటూ మీడియా ప్రశ్నించడంతో స్పందించారు. త్వరలోనే బీజేపీతో కలిసి ఉద్యమాలు నడుపుతానన్న ధీమా వ్యక్తం చేశారు పవన్ కల్యాణ్.

అమరావతి ఏరియా రైతాంగానికి హామీ ఇచ్చినట్లు పవన్ కల్యాణ్ శనివారం ఆ ప్రాంతంలోని గ్రామాల్లో పర్యటనకు తరలి వెళ్ళారు. భారీ ఎత్తున వచ్చిన జనసేన శ్రేణులతో కలిసి రాజధాని ఏరియాలోని తుళ్ళూరు, మందడం, ఉద్దండరాయుని పాలెం వంటి గ్రామాల్లో పర్యటనకు వెళ్ళారు. ఈ సందర్భంగా కొత్తగా వైసీపీ-బీజేపీ మధ్య పొడుస్తున్న స్నేహతిమిరాల గురించి ప్రశ్నిస్తూ.. జనసేన ఆటలో అరటి పండుగా మారిందా అంటూ మీడియా వేసిన ప్రశ్నలకు పవన్ కల్యాణ్ స్పందించారు.

Also read: Kanna crucial comments on friendship with YCP

ప్రస్తుతానికి బీజేపీ-జనసేన బంధం బలంగా వుందని, భవిష్యత్తులో రెండు పార్టీలు కలిసి ఉమ్మడి కార్యక్రమాలు నిర్వహిస్తాయని అన్నారు పవన్ కల్యాణ్. ఢిల్లీలో జగన్ కలుస్తున్నది భారతీయ జనతాపార్టీ నేతలను కాదు.. భారతీయ ప్రభుత్వ అధినేతలను కాబట్టి అందులో వేరే ఊహాగానాలు అవసరం లేదని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. రాజధాని విషయంలో బీజేపీ క్లారిటీ ఇచ్చిన తర్వాతనే తాను కమలం నేతలతో కలిసానని చెప్పుకొచ్చారు పవన్ కల్యాణ్. త్వరలోనే బీజేపీ నేతలతో కలిసి రాజధాని ప్రాంతంలో పర్యటనకు వస్తానని చెప్పారు పవన్ కల్యాణ్.