జగన్ సర్కారుపై పవన్ కళ్యాణ్ విమర్శనాస్త్రాలు, విగ్రహాలు ధ్వంసం చేసే వారిని పట్టుకోలేకపోవడంపై విమర్శ

| Edited By: Pardhasaradhi Peri

Jan 06, 2021 | 3:59 PM

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఏపీ సర్కారుపైనా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిమీదా విమర్శలు ఎక్కుపెట్టారు. సీఎం స్థాయికి తగని మాటలు..

జగన్ సర్కారుపై పవన్ కళ్యాణ్ విమర్శనాస్త్రాలు, విగ్రహాలు ధ్వంసం చేసే వారిని పట్టుకోలేకపోవడంపై విమర్శ
Follow us on

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఏపీ సర్కారుపైనా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిమీదా విమర్శలు ఎక్కుపెట్టారు. సీఎం స్థాయికి తగని మాటలు జగన్ మాట్లాడుతున్నారని చెప్పిన పవన్, గెరిల్లా వార్ ఫేర్ అంటూ జగన్ రెడ్డి బాధ్యత నుంచి తప్పించుకోజూస్తున్నారని ఆరోపించారు. ఆయన తలుచుకుంటే హైకోర్టు సీజేలు, న్యాయమూర్తులు క్షణంలో బదిలీ అవుతారని పవన్ చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 100కు పైగా దేవాలయాలపై గత రెండేళ్ల కాలంలో దాడులు జరిగాయని పవన్ అన్నారు. 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు, 115 మంది ఐ.పి.ఎస్ లు, మరో 115 మంది అదనపు ఎస్.పి.లు వేలాది మంది పోలీసు సిబ్బంది జగన్ చేతుల్లో ఉండగా విగ్రహాలను ధ్వంసం చేసే వారిని పట్టుకోలేకపోవడం విడ్డూరంగా ఉందని పవన్ వ్యాఖ్యానించారు.

“నిస్సహాయుడైన డాక్టర్ సుధాకర్ గారి పైన, సోషల్ మీడియాలో మీపైన, మీ పార్టీ వారిపైన పోస్టులు పెట్టేవారిపై అత్యుత్సాహంతో కేసులు పెట్టే పోలీసులు దేవుడి విగ్రహాలను ధ్వంసం చేసేవారిని పట్టుకుని ఎందుకు కేసులు పెట్టలేకపోతున్నారు. ఊరికో వాలంటీరు చొప్పున 2.60 లక్షల మందిని నియమించారు కదా .. వారు కూడా సమాచారం ఇవ్వలేకపొతున్నారా? ఎక్కడ వుంది లోపం? మీలోనా? మీ నీడలో వున్న వ్యవస్థలోనా?” అంటూ పవన్ కళ్యాణ్ ప్రశ్నల వర్షం కురింపించారు.