అక్కడ పసిపిల్లలకు పాలు కూడా దొరకడం లేదు…

|

Aug 21, 2020 | 11:27 PM

గోదావరి ముంపు గ్రామాల ప్రజల బాధలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పసిపిల్లలకు పాలు కూడా దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పునరావాస కేంద్రాల్లో సౌకర్యాలు మెరుగుపరిచి సరైన వైద్యం అందించాలని పవన్‌ డిమాండ్‌ చేశారు. పంట

అక్కడ పసిపిల్లలకు పాలు కూడా దొరకడం లేదు...
Follow us on

గోదావరి ముంపు గ్రామాల ప్రజల బాధలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పసిపిల్లలకు పాలు కూడా దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పునరావాస కేంద్రాల్లో సౌకర్యాలు మెరుగుపరిచి సరైన వైద్యం అందించాలని పవన్‌ డిమాండ్‌ చేశారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ముంపు ఇంతలా ఉండేది కాదన్న ఆయన త్వరితగతిన ప్రాజెక్టు పనులు చేయాలని కోరారు.

200 లంక గ్రామాలు మునిగిపోయాయని పవన్‌కల్యాణ్‌ వివరించారు. దీంతో 50వేల మందికిపైగా ప్రజలు నిరాశ్రయులయ్యారని తెలిపారు. పునరావాస కేంద్రాల్లో ప్రజలకు సరైన వైద్యం అందడం లేదని తెలిపారు. వైద్యులు అందుబాటులో లేరని చెప్పారు. పునరావాస కేంద్రాల్లో చిన్న పిల్లలు పాలు దొరక్క ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. అత్యవసర వస్తువుల జాబితాలో పాలు కూడా చేర్చాలని, మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆయన కోరారు.