Pawan Kalyan: పిడుగు పడ్డా పాలిటిక్స్ వదలను.. ఎమోషనల్ అయిన పవన్

|

Mar 14, 2020 | 5:38 PM

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎమోషనల్ అయ్యారు. ప్రజెంట్ పాలిటిక్స్‌పై ఆవేశపడ్డారు. పార్టీ శ్రేణులను అనునయించారు. జనసైనికుల్లో పోరాట స్పూర్తి నింపారు. ఎస్.. ఇదంతా పార్టీ ఆరో ఆవిర్భావ వేడుకల్లో నిర్వహించారు జనసేనాని పవన్ కల్యాణ్

Pawan Kalyan: పిడుగు పడ్డా పాలిటిక్స్ వదలను.. ఎమోషనల్ అయిన పవన్
Follow us on

Pawan Kalyan became emotional while speaking in party program: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎమోషనల్ అయ్యారు. ప్రజెంట్ పాలిటిక్స్‌పై ఆవేశపడ్డారు. పార్టీ శ్రేణులను అనునయించారు. జనసైనికుల్లో పోరాట స్పూర్తి నింపారు. ఎస్.. ఇదంతా పార్టీ ఆరో ఆవిర్భావ వేడుకల్లో నిర్వహించారు జనసేనాని పవన్ కల్యాణ్. 2014 మార్చి 14న పురుడు పోసుకున్న జనసేన పార్టీ ఆరో ఆవిర్భావ సదస్సు శనివారం రాజమండ్రిలో జరిగింది. సోదరుడు నాగబాబు, పార్టీ సీనియర్లు నాదెండ్ల మనోహర్‌తో కలిసి పవన్ కల్యాణ్ పాల్గొన్నారు.

భారీగా హాజరైన జనసైనికులనుద్దేశించి మాట్లాడిన పవన్ కల్యాణ్.. తాను పాలిటిక్స్‌లోకి రావడం ఆషామాషీగా జరగలేదని, ఎంతో మధన పడిన తర్వాతనే తన జీవితంలో అత్యంత ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నానని పవన్ కల్యాణ్ అన్నారు. పోరాడేతత్వాన్ని చిన్నప్పట్నించే అలవాటు చేసుకున్న తాను.. ఏ పనైనా సంపూర్ణంగా చేయాలన్న ఉద్దేశంతోనే పని చేస్తానని చెప్పారు. అంబేద్కరిజాన్ని, గాంధీయిజాన్ని ఒంటపట్టించుకున్న తాను.. పోరాడే తత్వాన్ని సుభాష్ చంద్రబోస్ నుంచి నేర్చుకున్నానన్నారు పవన్ కల్యాణ్.

సమాజంలో పిరికివాడిగా బతకదల్చుకోలేదని, అందుకో పోరాటపంథాను ఎంచుకుని రాజకీయాల్లోకి వచ్చానన్నారు పవన్ కల్యాణ్. పోరాట పంథా అంటే కత్తులు పుచ్చుకుని రోడ్డెక్కడం కాదని, ప్రశ్నించే తత్వమే పోరాట పంథా అని వివరించారు పవన్ కల్యాణ్. తన రాజకీయ భావాలను చెబుతూ ఎమోషనల్ అయిన పవన్ కల్యాణ్‌కు ఫ్యాన్స్, జనసేన శ్రేణులు అనుకూలంగా నినాదాలతో సదస్సును హోరెత్తించారు.