హోమ్ ఐసోలేష‌న్ గైడ్ లైన్స్ స‌వ‌రించిన కేంద్ర వైద్యారోగ్య శాఖ‌..వారికి అనుమ‌తి లేదు..

|

Jul 03, 2020 | 10:01 AM

ల‌క్ష‌ణాలు లేకుండానే అధిక సంఖ్య‌లో ప్ర‌జ‌లు కోవిడ్-19 బారిన ప‌డుతోన్న నేప‌థ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం హోమ్ ఐసోలేషన్ మార్గదర్శకాలను సవరించింది.

హోమ్ ఐసోలేష‌న్ గైడ్ లైన్స్ స‌వ‌రించిన కేంద్ర వైద్యారోగ్య శాఖ‌..వారికి అనుమ‌తి లేదు..
Follow us on

ల‌క్ష‌ణాలు లేకుండానే అధిక సంఖ్య‌లో ప్ర‌జ‌లు కోవిడ్-19 బారిన ప‌డుతోన్న నేప‌థ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం హోమ్ ఐసోలేషన్ మార్గదర్శకాలను సవరించింది. స్వల్ప లేదా ముందస్తు రోగలక్షణ ఉన్నవారు కూడా ఈ మార్గ‌ద‌ర్శ‌కాల‌ను ఇంట్లో నుంచే పాటించాల‌ని కోరింది. వ్యాధి నిరోధ‌న శ‌క్తి త‌క్కువ‌గా ఉండే హెచ్ఐవీ, క్యాన్స‌ర్ వంటి రోగులు హెమ్ ఐసోలేష‌న్ అవ్వ‌డానికి అర్హులు కాద‌ని తెలిపింది. అలాగే, 60 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వృద్ధ రోగులు, రక్తపోటు, మధుమేహం, గుండె జబ్బులు, దీర్ఘకాలిక ఊపిరితిత్తులు / కాలేయం / మూత్రపిండాల వ్యాధులు, సెరెబ్రో-వాస్కులర్ డిసీజ్ వంటి అనారోగ్య పరిస్థితులతో బాధపడుతున్నవారు మెడిక‌ల్ ఆఫిస‌ర్ హోల్త్ చెక‌ప్ చేసిన‌ తర్వాత మాత్రమే ఇంటి హెమ్ ఐసోలేష‌న్ కి అనుతించ‌బడాత‌ర‌ని పేర్కొంది. హోమ్ ఐసోలేట్ అయిన రోగులు వరుసగా మూడు రోజులు జ్వరం రాకుండా ఉండి, కరోనా లక్షణాలు లేనట్లైతే 10 రోజుల్లో హోం ఐసోలేషన్‌ నుంచి డిశ్చార్జ్‌ అవ్వొచ్చు.

“ల‌క్ష‌ణాలు క‌నిపించ‌ని, స్వ‌ల్ప ల‌క్ష‌ణాలు ఉన్న రోగులు ఇంట్లోనే హోమ్ ఐసోలేట్ అవ్వాలి. వారి ఆరోగ్యాన్ని వారే ఏడు రోజులు స్వీయ పర్యవేక్షణ చేసుకోవాలి. హెమ్ ఐపోలేష‌న్ ముగిసిన తర్వాత పరీక్ష చేయించుకోవాల్సిన‌ అవసరం లేదు” అని హెమ్ ఐసోలేషన్ కోసం రివైజ్డ్ గైడ్లైన్స్ పేర్కొంది.

అయితే, ముందస్తు రోగలక్షణాలు లేదా చాలా తేలికపాటి లక్షణాలను కలిగి ఉన్న రోగులు.. కుటుంబ స‌భ్యుల‌తో సంబంధాన్ని నివారించడానికి ఇంట్లో అవసరమైన స్వీయ-ఐసోలేషన్ సదుపాయాన్ని కలిగి ఉంటేనే ఈ ప‌ద్ద‌తి ఫాలో అవ్వాల‌ని తెలిపింది.