తిరుమలలో ఏకాంతంగా పార్వేట ఉత్సవం

|

Oct 25, 2020 | 11:35 PM

శ్రీవారి ఆలయంలో విజ‌యద‌శ‌మి పార్వేట ఉత్స‌వం ఏకాంతంగా జ‌రిగింది. శ్రీ‌వారి న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాలు ముగిసిన‌ మ‌రుస‌టి రోజున ఈ ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. అంతేకాదు సంక్రాంతి క‌నుమ పండుగ రోజు కూడా తిరుమ‌ల‌లో పార్వేట ఉత్స‌వం నిర్వ‌హిస్తారు.

తిరుమలలో ఏకాంతంగా పార్వేట ఉత్సవం
Follow us on

Shrivari Navratri Brahmotsavalu : శ్రీవారి ఆలయంలో విజ‌యద‌శ‌మి పార్వేట ఉత్స‌వం ఏకాంతంగా జ‌రిగింది. శ్రీ‌వారి న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాలు ముగిసిన‌ మ‌రుస‌టి రోజున ఈ ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. అంతేకాదు సంక్రాంతి క‌నుమ పండుగ రోజు కూడా తిరుమ‌ల‌లో పార్వేట ఉత్స‌వం నిర్వ‌హిస్తారు.

ఈ సంద‌ర్భంగా మ‌ధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4.30 గంట‌ల వ‌ర‌కు శ్రీ‌వారి ఆల‌యంలోని కళ్యాణోత్సవ‌ మండపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారిని వేంచేస్తారు. శ్రీ‌మ‌ల‌య‌ప్ప‌స్వామివారు పంచాయుధాలైన శంఖం, చ‌క్రం, గ‌ద‌, ఖ‌డ్గం, ధ‌నస్సు ధ‌రించి పార్వేట ఉత్స‌వంలో పాల్గొన్నారు. ఈ ఉత్స‌వంలో భాగంగా టీటీడీ ఈవోకు ఆల‌య మ‌ర్యాద ప్ర‌కారం ప‌రివ‌ట్టం కట్టారు.

కొవిడ్ నిబంధనల కారణంగా కళ్యాణోత్సవ మండపంలోనే అడవిని ఏర్పాటు చేశారు. టీటీడీ అటవీశాఖ ఆధ్వర్యంలో ఏడు కొండలతో పాటు శేషాచలాన్ని తలపించేలా రూపొందించిన నమూనా అడవిలో వివిధ రకాల చెట్లు, రాళ్లు ఏర్పాటు చేశారు. అందులో మన్యమృగాల బొమ్మలను ఏర్పాటు చేశారు.