నిర్మలమ్మ బడ్జెట్‌లో ‘గాంధీపీడియా’

| Edited By:

Jul 05, 2019 | 2:07 PM

జాతిపిత మహాత్మగాంధీకి నివాళిగా వికీపీడియా తరహాలో గాంధీపీడియాను ప్రారంభించనున్నామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆమె మాట్లాడుతూ.. గాంధీపీడియా ద్వారా మహాత్ముని విలువలు, బోధనలు ప్రచారం చేయనున్నామని తెలిపారు. కాగా ఈ ఏడాది గాంధీ 150వ జయంతిని పురస్కరించుకొని కేంద్రం ఈ చర్యలు చేపట్టబోతున్నట్లు తెలుస్తోంది. కాగా గాంధీ బోధనల ఆధారంగానే ఈ ఏడాది ఆర్థిక సర్వే జరిగిందని గురవారం ప్రధాన ఆర్థిక సలహాదారు కె. సుబ్రమణియన్ పేర్కొన్న విషయం తెలిసిందే. […]

నిర్మలమ్మ బడ్జెట్‌లో ‘గాంధీపీడియా’
Follow us on

జాతిపిత మహాత్మగాంధీకి నివాళిగా వికీపీడియా తరహాలో గాంధీపీడియాను ప్రారంభించనున్నామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆమె మాట్లాడుతూ.. గాంధీపీడియా ద్వారా మహాత్ముని విలువలు, బోధనలు ప్రచారం చేయనున్నామని తెలిపారు. కాగా ఈ ఏడాది గాంధీ 150వ జయంతిని పురస్కరించుకొని కేంద్రం ఈ చర్యలు చేపట్టబోతున్నట్లు తెలుస్తోంది. కాగా గాంధీ బోధనల ఆధారంగానే ఈ ఏడాది ఆర్థిక సర్వే జరిగిందని గురవారం ప్రధాన ఆర్థిక సలహాదారు కె. సుబ్రమణియన్ పేర్కొన్న విషయం తెలిసిందే. మీరు చేపట్టే ఏ చర్యలకు ముందైనా అవి పేద ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడతాయో ఒక్కసారి ఆలోచించండి అన్న గాంధీ బోధనల ఆధారంగా ఈ సర్వే సాగిందని వెల్లడించిన విషయం తెలిసిందే.