సొంతూరి కోసం చిన్నారితో సాహసం

|

May 14, 2020 | 2:24 PM

పాలమూరుకి చెందిన వలస కూలీ దంపతులు సొంతూరికి రావాలన్న తాపత్రయం వారితో సాహసం చేయించింది. ఏకంగా 670 కిలో మీటర్లు చంటి పిల్లాడితో సహా ప్రయాణం చేశారు.

సొంతూరి కోసం చిన్నారితో సాహసం
Follow us on

పాలమూరుకి చెందిన వలస కూలీ దంపతులు సొంతూరికి రావాలన్న తాపత్రయం వారితో సాహసం చేయించింది. ఏకంగా 670 కిలో మీటర్లు చంటి పిల్లాడితో సహా ప్రయాణం చేశారు.జోగుళాంబ గద్వాల జిల్లా నవాబుపేట మండలంలోని కొత్తపల్లితండాకు చెందిన భార్యాభర్తలు తమ ఏడునెలల చిన్నారితో పూణే నుంచి బైక్‌పై 12 గంటల పాటు ప్రయాణించి గమ్యస్థానం చేరుకున్నారు. కొత్తపల్లి తండాకు చెందిన విశాల్, లీలాబాయి పూణెలో టైల్స్‌ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. లాక్‌డౌన్‌తో ఉపాధి లేక సొంతూరికి రావాలని, తల్లిదండ్రులను చూడాలన్న తపనతో పలుమార్లు ప్రయత్నించారు. విఫలం కావటంతో చివరికి బైక్‌పై మంగళవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో పూణెలోని ఉథార్‌ నుంచి బయలుదేరి బుధవారం ఉదయం 10 గంటలకు తండాకు చేరుకున్నారు. సొంతూరికి చేరుకున్నవారిని గ్రామంలోని వైద్య సిబ్బంది వారిని పరీక్షించి ఆరోగ్యంగానే ఉన్నారని, 14 రోజులపాటు హోం క్వారంటైన్‌లో ఉండాలని మండల అధికారులు సూచించారు.  బస్సులో గానీ రైల్లో గానీ అందరితో కలిసి వస్తే చిన్నారికి ప్రమాదమని భావించి ఎవరూ చెప్పినా వినకుండా ధైర్యం చేసి బైక్‌పై బయలుదేరామన్నారు పాప తండ్రి విశాల్‌.