పాక్‌లో.. మరో 15 మంది నకలీ పైలెట్లపై వేటు..

| Edited By:

Jul 18, 2020 | 9:44 PM

పాకిస్తాన్ ఏవియేషన్ అథారిటీ అనుమానాస్పద లైసెన్సులను కలిగి ఉన్నందుకు మరో 15 మంది పైలట్లను సస్పెండ్ చేసింది. దీంతో ఇప్పటి వరకు నకిలీ లైసెన్సుల కారణంగా విధుల నుంచి దిగిపోయిన పైలెట్ల సంఖ్య

పాక్‌లో.. మరో 15 మంది నకలీ పైలెట్లపై వేటు..
Follow us on

Pakistans aviation authority: పాకిస్తాన్ ఏవియేషన్ అథారిటీ అనుమానాస్పద లైసెన్సులను కలిగి ఉన్నందుకు మరో 15 మంది పైలట్లను సస్పెండ్ చేసింది. దీంతో ఇప్పటి వరకు నకిలీ లైసెన్సుల కారణంగా విధుల నుంచి దిగిపోయిన పైలెట్ల సంఖ్య 93కు చేరుకున్నట్టు స్థానిక మీడియా వెల్లడించింది. అనుమానాస్పద లైసెన్సులున్నాయంటూ విమానయాన విభాగం గత నెలలో 262 మందిని విధుల నుంచి దూరం పెట్టింది. ఇందులో ఇప్పటి వరకు 93 మంది పైలెట్లను సస్పెండ్ చేయగా.. మరో 141 మంది పైలెట్లపై విచారణ జరుగుతున్నట్టు పత్రిక వెల్లడించింది. ఇప్పటికే 28 మంది పైలెట్ల లైసెన్సులను పాక్ ప్రభుత్వం రద్దు చేసినట్టు తెలిపింది.

Also Read: విధులకు హాజరు‌ కాకపోతే.. రిటైర్మెంటే గతి ..!