భారత్ వైపు పాకిస్తాన్ డ్రోన్.. పసిగట్టేలోపే పలాయనం..

|

Oct 31, 2020 | 12:26 PM

పాకిస్తాన్ కు అంతర్జాతీయంగా మద్దతు కరువవుతున్నా తన తీరు మార్చుకోవడం లేదు

భారత్ వైపు పాకిస్తాన్ డ్రోన్.. పసిగట్టేలోపే పలాయనం..
Drone spotted at Indian High Commision in PAK
Follow us on

పాకిస్తాన్ కు అంతర్జాతీయంగా మద్దతు కరువవుతున్నా తన తీరు మార్చుకోవడం లేదు. కుక్క తోక వంకర అనే చంధంగా మారింది. ఏదో ఓ విధంగా భారత్ ను ఇబ్బంది పెట్టేందుకు యత్నిస్తూనే ఉంది. శుక్రవారం అర్ధరాత్రి 11:35 గం.లకు మరోసారి భారత గగనతలంలోకి చొచ్చుకుని వచ్చేందుకు డ్రోన్ ను బీఎస్ఎఫ్ బలగాలు గుర్తించాయి. పంజాబ్ లోని గురుదాస్ పూర్ ప్రాంతంలో చక్కర్లు కొడుతున్న ఈ డ్రోన్ ను మన బలగాలు పసిగట్టాయి. పాక్ డ్రోన్ మన భూభాగంలోకి రావడం గత కొద్ది రోజులుగా ప్రయత్నిస్తూనే ఉందిజ

గురుదాస్ పూర్ ప్రాంతంలో భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలోనే.. భద్రతా బలగాలకు ఒక్కసారిగా డ్రోన్ శబ్దం వినిపించింది. ఆ శబ్దం పాకిస్తాన్ వైపు నుంచి వస్తుందని భద్రతా బలగాలు పసిగట్టాయి. వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు ఆ డ్రోన్ పైకి తుపాకీలను ఎక్కుపెట్టాయి. అంతలోనే తుర్రుమంటూ డ్రోన్ పలాయనం చిత్తగించిందని.. పాకిస్తాన్ వైపు వెళ్లిపోయిందని ఉన్నతాధికారులు ప్రకటించారు. ఈ డ్రోన్ దాదాపుగా 400 మీటర్ల ఎత్తులో 1800 మీటర్లకు పైగా భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చిందని, చివరికి గురుదాస్ పూర్ లోని ఠాకూర్‌పూర్ గ్రామంలో దీనిని గుర్తించినట్లు అధికారులు తెలిపారు.