పాక్ ఉగ్రవాద సంస్థలతో చైనా చర్చలు !

లదాఖ్ ప్రాంతంలో ఉద్రిక్తతలను సడలించేందుకు ఓ వైపు భారత-చైనా దళాలు సైనిక స్థాయిలో చర్చలు జరుపుతుండగా.. మరోవైపు గిల్గిట్-బల్టిస్తాన్ ప్రాంతంలో డ్రాగన్ కంట్రీ తన సైనికులను తరలిస్తోందని, పైగా జమ్మూ కాశ్మీర్ లో హింసను..

పాక్ ఉగ్రవాద సంస్థలతో చైనా చర్చలు !
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 01, 2020 | 11:21 AM

లదాఖ్ ప్రాంతంలో ఉద్రిక్తతలను సడలించేందుకు ఓ వైపు భారత-చైనా దళాలు సైనిక స్థాయిలో చర్చలు జరుపుతుండగా.. మరోవైపు గిల్గిట్-బల్టిస్తాన్ ప్రాంతంలో డ్రాగన్ కంట్రీ తన సైనికులను తరలిస్తోందని, పైగా జమ్మూ కాశ్మీర్ లో హింసను రెచ్ఛగొట్టేందుకు పాక్ ఉగ్రవాద సంస్థ..’ఆల్ బదర్’ తో సంప్రదింపులు జరుపుతోందని తెలుస్తోంది. లడాఖ్ ఉత్తర ప్రాంతంలో ఇప్పటికే ఉన్న చైనా దళాలకు తోడుగా పాకిస్తాన్ సుమారు 20 వేల మంది సైనికులను తరలించినట్టు సమాచారం. ఇండియాపై రెండు వైపులా ఎటాక్ చేసేందుకు ఇది అవకాశంగా పాక్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ దేశానికి చెందిన ఐఎస్ఐ.. కరడు  గట్టిన మరికొందరు టెర్రరిస్టులను జమ్మూ కాశ్మీర్ లోయలోకి తరలించేందుకు యత్నిస్తున్నట్టు కూడా తెలిసింది. కాశ్మీర్ లోకి  వంద మంది ఉగ్రవాదులను పంపి ఇండియాను అంతర్గతంగా దెబ్బ తీసేందుకు కూడా పాక్ ప్రయత్నిస్తోందని అంటున్నారు. కాశ్మీర్ లో ఇటీవల 120 మంది ఉగ్రవాదులను భారత దళాలు మట్టుబెట్టాయి. వీరిలో చాలామంది స్థానికులని, కొంతమంది విదేశీ టెర్రరిస్టులు కూడా ఉన్నారని తెలియవచ్చింది. అంటే స్థానికులను కూడా పాక్ ఉగ్రవాదులుగా మార్చేందుకు యత్నిస్తున్నదనే విషయం  స్పష్టమవుతోంది.