షాకింగ్‌.. భగ్గుమన్న పెట్రో ధరలు.. లీటరుపై రూ.26 పెంపు..!

| Edited By:

Jun 27, 2020 | 12:47 PM

పాకిస్థాన్‌లో పెట్రో మంటలు మండుతున్నాయి. ఓ వైపు కరోనా మహమ్మారి టెన్షన్ పెడుతుంటే.. మరోవైపు ఇప్పుడు పెట్రో ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకి ఎగిసి పడుతున్నాయి.

షాకింగ్‌.. భగ్గుమన్న పెట్రో ధరలు.. లీటరుపై రూ.26 పెంపు..!
Follow us on

పాకిస్థాన్‌లో పెట్రో మంటలు మండుతున్నాయి. ఓ వైపు కరోనా మహమ్మారి టెన్షన్ పెడుతుంటే.. మరోవైపు ఇప్పుడు పెట్రో ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకి ఎగిసి పడుతున్నాయి. ఏకంగా ఒకేసారి.. రూ.26 పెంచడంతో.. అక్కడి ప్రజలంతా బిత్తరపోయారు. నిన్నటి వరకు లీటర్ పెట్రోల్ ధర 74.52గా ఉండగా.. తాజాగా పెరిగిన ధరతో లీటర్ పెట్రోల్ ధర 100.10కి చేరింది. లీటర్ పెట్రోల్‌పై రూ.25.58 పైసలు పెరిగింది. ఇక హైస్పీడ్ డీజిల్ ధర కూడా వంద మార్క్‌ను దాటేసింది. లీటర్‌పై రూ.21.31 పెరగడంతో.. ప్రస్తుతం లీటర్ హై స్పీడ్ డీజిల్‌ ధర రూ. 101.26కి చేరింది. ఇక నిన్నటి వరకు రూ.38.14 ఉన్న లీటర్‌ నార్మల్ డీజిల్‌ ధర.. ఇప్పుడు రూ.55.98కి చేరింది. ఇక లీటర్‌ కిరోసిన్ ధర.. రూ.59.06గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్‌ ఆయిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో పెట్రో ధరలు పెంచామని పాక్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల జూన్ 30 వరకు ఇవే ధరలు కొనసాగుతాయని.. ఆ తర్వాత ధరల గురించి రీవ్యూ చేసి.. మార్పులు చేస్తామని తెలిపారు.