పాక్ జట్టు వార్షిక వేతనం.. జడేజా కన్నా రూ.40 లక్షలు ఎక్కువ..

|

Aug 03, 2020 | 5:28 PM

ప్రపంచంలోని అత్యంత ధనిక క్రికెట్ బోర్డు ఏదంటే.? ఠక్కున అందరూ కూడా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) అని చెబుతారు. ఒక్కో ఆటగాడికి బీసీసీఐ కోట్లలో వార్షిక వేతనాలను చెల్లుస్తుంది.

పాక్ జట్టు వార్షిక వేతనం.. జడేజా కన్నా రూ.40 లక్షలు ఎక్కువ..
Follow us on

Ravindra Jadeja IPL Contract: ప్రపంచంలోని అత్యంత ధనిక క్రికెట్ బోర్డు ఏదంటే.? ఠక్కున అందరూ కూడా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) అని చెబుతారు. ఒక్కో ఆటగాడికి బీసీసీఐ కోట్లలో వార్షిక వేతనాలను చెల్లుస్తుంది. అంతేకాకుండా అటు ఐపీఎల్‌ ద్వారా కూడా మన ఇండియన్ క్రికెటర్లు కోట్లు సంపాదిస్తారు. ఇదిలా ఉంటే భారత క్రికెట్ జట్టులో ముఖ్యమైన ఆటగాడు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా.. ఇతడు ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

ఆ జట్టులో కీ ప్లేయర్ కావడం వల్ల.. సీఎస్కే జడేజాకు ఏడాదికి రూ. 7 కోట్లు చెల్లిస్తోంది. అయితే ఇక్కడ ఒక చిత్రమైన విషయం ఏంటంటే.. జడేజా తీసుకునే ఐపీఎల్ వార్షిక వేతనం కంటే రూ. 40 లక్షలు ఎక్కువ పాక్ జట్టు మొత్తం 2020-21 సంవత్సరానికి గాను జీతాలు అందుకుంది. ప్రతీ సంవత్సరం రూ. 7.40 కోట్లను మొత్తం 18 మంది ఆటగాళ్లకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు వార్షిక కాంట్రాక్టు రూపంలో చెల్లిస్తోంది.

Also Read: సీఎస్‌కే విజయాల్లో ధోనీదే కీలక పాత్ర..