అంతర్జాతీయ ఉగ్రవాదిగా టీటీపీ చీఫ్‌ నూర్ వలి.. యూఎన్ ప్రకటన..

| Edited By:

Jul 17, 2020 | 6:59 AM

తెహ్రిక్‌-ఎ-తాలిబన్ పాకిస్థాన్‌ చీఫ్ నూర్ వలినీ అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది ఐక్యరాజ్యసమితి. పాక్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ ఉగ్ర సంస్థ.. అనేక ఆత్మాహుతి దాడులకు పాల్పడుతోంది. ఈ క్రమంలోనే ఆ ఉగ్ర సంస్థ..

అంతర్జాతీయ ఉగ్రవాదిగా టీటీపీ చీఫ్‌ నూర్ వలి.. యూఎన్ ప్రకటన..
Follow us on

తెహ్రిక్‌-ఎ-తాలిబన్ పాకిస్థాన్‌ చీఫ్ నూర్ వలినీ అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది ఐక్యరాజ్యసమితి. పాక్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ ఉగ్ర సంస్థ.. అనేక ఆత్మాహుతి దాడులకు పాల్పడుతోంది. ఈ క్రమంలోనే ఆ ఉగ్ర సంస్థ చీఫ్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. ఈ క్రమంలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని భద్రతా మండలి కమిటీ ఆమోదించింది. దీంతో ఈ ఉగ్ర సంస్థ చీఫ్ ఆస్తుల‌ను స్తంభింపజేయడంతో పాటు.. ప్రయాణాలు, ఆయుధాలు ఉప‌యోగించ‌డం వంటి అంశాల్లో ఆంక్షలు విధించింది. ఈ తెహ్రిక్‌-ఎ-తాలిబన్ పాకిస్థాన్‌ ఉగ్ర సంస్థను పాక్ తాలిబన్‌గా కూడా పిలుస్తారు. ఈ సంస్థ‌ను గ‌తంలోనే డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పెష‌ల్ డిసిగ్నేటెడ్ గ్లోబ‌ల్ టెర్ర‌రిస్ట్‌గా పేర్కొనేవారు.