పాదయాత్ర చేస్తే ఏపీ ప్రజలు పట్టం కట్టేస్తారంతే!

|

May 23, 2019 | 5:31 PM

ఆంధ్రప్రదేశ్..అక్షరక్రమంలో ముందు వరసలో ఉన్న స్టేట్‌లో ప్రజలు కూడా చాలా తెలివిగా బిహేవ్ చేస్తారు. రాజకీయంగా అత్యంత చైతన్యం కలిగిన ప్రజలు ఏపీలో ఉన్నారు. అయితే కుల సమీకరణాలు ఎన్ని ఉన్నా కూడా ఒక నాయకుడికి ఎమోషనల్‌గా కనెక్ట్ అయితే మాత్రం అవన్ని పట్టించుకోకుండా ఆ లీడర్ వైపు వాలిపోతారు. కాస్త లోతుగా ఆలోచిస్తే ఏపీలో పాదయాత్ర చేసిన ప్రతి నాయకుడికి రాష్ట్ర ప్రజలు పట్టం కట్టారు. పాదయాత్ర అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు  వైఎస్ రాజశేఖర్‌రెడ్డి. […]

పాదయాత్ర చేస్తే ఏపీ ప్రజలు పట్టం కట్టేస్తారంతే!
Follow us on

ఆంధ్రప్రదేశ్..అక్షరక్రమంలో ముందు వరసలో ఉన్న స్టేట్‌లో ప్రజలు కూడా చాలా తెలివిగా బిహేవ్ చేస్తారు. రాజకీయంగా అత్యంత చైతన్యం కలిగిన ప్రజలు ఏపీలో ఉన్నారు. అయితే కుల సమీకరణాలు ఎన్ని ఉన్నా కూడా ఒక నాయకుడికి ఎమోషనల్‌గా కనెక్ట్ అయితే మాత్రం అవన్ని పట్టించుకోకుండా ఆ లీడర్ వైపు వాలిపోతారు. కాస్త లోతుగా ఆలోచిస్తే ఏపీలో పాదయాత్ర చేసిన ప్రతి నాయకుడికి రాష్ట్ర ప్రజలు పట్టం కట్టారు. పాదయాత్ర అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు  వైఎస్ రాజశేఖర్‌రెడ్డి. ప్రజాప్రస్థానం పేరుతో ఆయన ఉమ్మడి సంచలనాత్మక రాజకీయాలకు తెర తీశారు. 2003 ఏప్రిల్ 9న ఆయన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి పాదయాత్ర మొదలు పెట్టి 1468 కిలోమీటర్ల మేర కాలినడకన రాష్ట్రమంతా తిరిగి శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురంలో ముగించారు. ఆ దెబ్బకు 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అఖండ విజయాన్ని సాధించింది. ఆ ఎన్నికల్లో అధికార టీడీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఆ తర్వాత ఆయన దేశ రాజకీయాల్లోనే తిరుగులేని నేతగా ఎదిగారు. ఆ తర్వాత 2012 అక్టోబర్ 2న ‘వస్తున్నా నీకోసం’ అంటూ చంద్రబాబు పాదయాత్ర చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా 2340 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేపట్టగా, 2014 ఎన్నిల్లో చంద్రబాబు ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చారు.

2014 ఎన్నికల్లో పరాజయాన్ని మూట గట్టుకున్న వైసీపీ అధినేత జగన్ 2017 నవంబరు 6న కడప జిల్లా ఇడుపులపాయ నుంచి పాదయాత్రను ప్రారంభించి 3వేల కిలోమీటర్లకు పైగా నడిచారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను టీడీపీ కొనుగోలు చేస్తోందని, ప్రజాకోర్టులోనే తేల్చుకుంటానని అసెంబ్లీకి గుడ్ బై చెప్పి ప్రజల బాట పట్టారు. టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణాల హామీని పూర్తిగా అమలు చేయకపోవడం, ఫీజు రియంబర్స్‌మెంట్, ఆరోగ్య శ్రీ పథకాలలోని  ప్రభుత్వ వైపల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు.

ఈ సుదీర్ఘ పాదయాత్రలోొ ప్రజలు జగన్‌కు బాగా దగ్గరయ్యారు. దాని ఫలితమే తాజా ఎన్నికల్లో చారీత్రాత్మక విజయం. ఫలితాలు చూస్తంటే పాదయాత్ర ఫ్యూచర్‌లో నాయకులకు తప్పని సెంటిమెంట్‌గా మారే అవకాశం కనిపిస్తోంది.