చిదంబరం, ఆయన కుమారుడి కార్తీకి సుప్రీంలో ఊరట

| Edited By:

May 30, 2019 | 1:09 PM

ఎయిర్‌సెల్-మాక్సిస్ కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం, ఆయన కుమారుడు కార్తీ చిదంబరానికి ఊరట లభించింది. అరెస్టు నుంచి మినహాయింపు ఆగస్టు 1వ తేదీ వరకు పొడగిస్తూ ఢిల్లీ కోర్టు తీర్పు ఇచ్చింది. ఎయిర్‌సెల్-మ్యాక్సిస్ మనీ లాండరింగ్ పీ చిదంబరంను ఎ1 నిందితుడిగా పేర్కొంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చార్జిషీటు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. చిదంబరంతోపాటు భాస్కరామన్, నాలుగు మాక్సిస్ కంపెనీలు సహా 9 మందిని నిందితులుగా ఈ సప్లిమెంటరీ చార్జ్‌షీట్‌లో […]

చిదంబరం, ఆయన కుమారుడి కార్తీకి సుప్రీంలో ఊరట
Follow us on

ఎయిర్‌సెల్-మాక్సిస్ కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం, ఆయన కుమారుడు కార్తీ చిదంబరానికి ఊరట లభించింది. అరెస్టు నుంచి మినహాయింపు ఆగస్టు 1వ తేదీ వరకు పొడగిస్తూ ఢిల్లీ కోర్టు తీర్పు ఇచ్చింది. ఎయిర్‌సెల్-మ్యాక్సిస్ మనీ లాండరింగ్ పీ చిదంబరంను ఎ1 నిందితుడిగా పేర్కొంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చార్జిషీటు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. చిదంబరంతోపాటు భాస్కరామన్, నాలుగు మాక్సిస్ కంపెనీలు సహా 9 మందిని నిందితులుగా ఈ సప్లిమెంటరీ చార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. ఎయిర్‌సెల్-మాక్సిస్ కేసులో తండ్రీకొడుకులిద్దరిపై మనీలాండరింగ్ అభియోగాలను సీబీఐ, ఈడీ గతంలో నమోదు చేశాయి. అయితే వీరిని అరెస్టు చేయకుండా గత మార్చిలో కోర్టు తాత్కాలిక రక్షణ కల్పించింది. చిదంబరం గత ఏడాది మేలో ముందస్తు బెయిలుకు దరఖాస్తు చేసుకోగా, ఆయనను అరెస్టు చేయకుండా ఎప్పటికప్పుడు ఇన్‌టర్మ్ ప్రొటక్షన్‌ను కోర్టు పొడిగిస్తూ వస్తోంది.