Oxford vaccine: ఆక్స్‌ఫర్డ్‌ టీకా.. 5 కోట్ల డోసులు సిద్ధంగా ఉంచాము: సీరం ఇన్‌స్టిట్యూట్‌ సీఈవో

|

Dec 28, 2020 | 9:34 PM

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. వైరస్‌కు ఎలాంటి వ్యాక్సిన్‌ లేని కారణంగా పాజిటివ్‌ కేసులు పెరిగిపోతున్నాయి. వైరస్‌ను కట్టడి చేసేందుకు భారత్‌తో పాటు పలు దేశాలు తీవ్ర స్థాయిలో...

Oxford vaccine: ఆక్స్‌ఫర్డ్‌ టీకా.. 5 కోట్ల డోసులు సిద్ధంగా ఉంచాము: సీరం ఇన్‌స్టిట్యూట్‌ సీఈవో
Follow us on

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. వైరస్‌కు ఎలాంటి వ్యాక్సిన్‌ లేని కారణంగా పాజిటివ్‌ కేసులు పెరిగిపోతున్నాయి. వైరస్‌ను కట్టడి చేసేందుకు భారత్‌తో పాటు పలు దేశాలు తీవ్ర స్థాయిలో శ్రమిస్తున్నాయి. ఇక తాజాగా సీరం ఇన్‌స్టిట్యూట్‌ సీఈవో అదర్‌ పునావాలా మరో ప్రకటన చేశారు. ఎంతగానో ఎదురు చూస్తున్న కరోనా వ్యాక్సిన్‌ జనవరిలోనే భారత్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ప్రకటించారు.

నూతన సంవత్సర శుభవార్తగా అభివర్ణించాలని అన్నారు. ఇప్పటికే దాదాపు 5 కోట్ల కొవిషీల్డ్‌ టీకా డోసులను సిద్ధంగా ఉంచినట్లు చెప్పారు. ఇప్పటికే నాలుగైదు కోట్ల డోసుల కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌లు సిద్ధంగా ఉన్నాయని, మరి కొన్ని రోజుల్లోనే నియంత్రణ సంస్థల నుంచి అనుమతి వచ్చే అవకాశం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. జులై 2021 నాటికి 30 కోట్ల డోసులను ఉత్పత్తి చేస్తామని ఆయన ఓ మీడయా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.

వ్యాక్సిన్‌కు అనుమతి వచ్చిన మొదటి, రెండు నెలల్లోనే పంపిణీ కాస్త ఆలస్యంగా జరుగుతుందని, అనంతరం వేగవంతం కొనసాగుతుందన్నారు. టీకా వల్ల ఎలాంటి అనుమానాలు వద్దని, 92 నుంచి 95 శాతం సమర్థతతో ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ పని చేస్తుందని అన్నారు. యూకేలో ఈ వారంలో లేదా జనవరిలో తొలి వారంలో వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తుందన్నారు.