ఏపీలోని ఆ జిల్లాలో కరోనా కల్లోలం.. 7వేలు దాటిన పాజిటివ్ కేసులు..

| Edited By:

Jul 25, 2020 | 11:20 AM

దేశంలో కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో పశ్చిమగోదావరి జిల్లాలో  నిన్న ఒక్కరోజే  763 కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల

ఏపీలోని ఆ జిల్లాలో కరోనా కల్లోలం.. 7వేలు దాటిన పాజిటివ్ కేసులు..
Follow us on

Coronavirus positive cases: దేశంలో కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో పశ్చిమగోదావరి జిల్లాలో  నిన్న ఒక్కరోజే  763 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 7,890కు చేరింది. ఏలూరులో నిన్న 200 కేసులు నమోదయ్యాయి. వారం రోజుల్లో ఏలూరులో 19 వందలకు పైగా కేసులు నమోదయ్యాయి. జిల్లా వ్యాప్తంగా  కంటైన్మెంట్ జోన్లు 730కు పెరిగాయి.

కరోనా కట్టడికోసం ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపడుతున్నా కేసుల సంఖ్య మాత్రం తగ్గడంలేదు. తాజాగా.. పశ్చిమగోదావరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. గత కొన్ని రోజులుగా అధికారిణి జ్వరంతో బాధపడుతోంది. యాంటిజెన్ టెస్ట్‌లో నెగిటివ్ అని రాగా… ఆర్‌టీపీసీఆర్ టెస్ట్‌లో పాజిటివ్‌గా తేలింది. దీంతో అధికారిణిని చికిత్స నిమిత్తం ఏలూరు కోవిడ్ ఆసుపత్రికి తరలించారు.

Also Read: తెలంగాణలో.. మూతపడనున్న 16 ఇంజనీరింగ్‌ కాలేజీలు..!