గోదావరికి పోటెత్తిన వరద.. జలదిగ్బంధంలో 60 గ్రామాలు..!

| Edited By:

Aug 18, 2020 | 1:27 PM

ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాల వల్ల గోదావరికి వరద పోటెత్తింది. దీంతో పోలవరం నియోజకవర్గంలో 60 గ్రామాలు వరదలో చిక్కుకున్నాయని ఎమ్మెల్యే తెల్లం బాలరాజు తెలిపారు. మంగళవారం ఆయన వరద

గోదావరికి పోటెత్తిన వరద.. జలదిగ్బంధంలో 60 గ్రామాలు..!
Follow us on

Villages affected by Godavari floods: ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాల వల్ల గోదావరికి వరద పోటెత్తింది. దీంతో పోలవరం నియోజకవర్గంలో 60 గ్రామాలు వరదలో చిక్కుకున్నాయని ఎమ్మెల్యే తెల్లం బాలరాజు తెలిపారు. మంగళవారం ఆయన వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. వేలేరుపాడులో పునరావాస కేంద్రాలను పరిశీలించిన ఎమ్మెల్యే.. గర్భిణీల ఆరోగ్యం అడిగి తెలుసుకున్నారు. పునరావాస కేంద్రాల్లో ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో.. ఐదువేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ముంపు బాధితులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. మూడు నెలలకు సరిపడా నిత్యావసర వస్తువులు సిద్ధంగా ఉంచామని ఎమ్మెల్యే బాలరాజు వెల్లడించారు.