పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్ న్యూస్… వడ్డీ శాతం పెంపు!

| Edited By:

Sep 17, 2019 | 5:58 PM

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్(ఈపీఎఫ్‌) చందాదారులు 2018-19 సంవత్సరానికి గాను ప్రస్తుతమున్న 8.55 శాతం వడ్డీకి బదులు 8.65 శాతాన్ని పొందనున్నట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్‌ గంగ్వార్‌ తెలిపారు. ఆరు కోట్లకు పైగా చందాదారులకు మేలు కలిగించేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ప్రకటించారు. ఢిల్లీలో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ గంగ్వార్‌ ఈ విషయం తెలిపారు. కార్మిక, ఆర్థిక మంత్రిత్వ శాఖల మధ్య వడ్డీరేటుపై ఉన్న భిన్నాభిప్రాయాలను తొలగించుకొనేందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో జరిపిన […]

పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్ న్యూస్... వడ్డీ శాతం పెంపు!
Follow us on

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్(ఈపీఎఫ్‌) చందాదారులు 2018-19 సంవత్సరానికి గాను ప్రస్తుతమున్న 8.55 శాతం వడ్డీకి బదులు 8.65 శాతాన్ని పొందనున్నట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్‌ గంగ్వార్‌ తెలిపారు. ఆరు కోట్లకు పైగా చందాదారులకు మేలు కలిగించేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ప్రకటించారు. ఢిల్లీలో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ గంగ్వార్‌ ఈ విషయం తెలిపారు. కార్మిక, ఆర్థిక మంత్రిత్వ శాఖల మధ్య వడ్డీరేటుపై ఉన్న భిన్నాభిప్రాయాలను తొలగించుకొనేందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో జరిపిన చర్చల్లో 8.65 శాతం వడ్డీ రేటు చెల్లించినా సంస్థ వద్ద సరిపడా మిగులు ఉందని వివరించిన అనంతరం పెంపుదలకు మార్గం సుగమమైనట్టు ఒక అధికారి తెలిపారు. ఆర్థిక శాఖ జనరల్ ప్రావిడెంట్ ఫండ్(GPF) తదితర నిధులపై గతంలో 8.0 శాతంగా ఉన్న వడ్డీ రేటును సెప్టెంబర్ 30 నాటికి 7.99 శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే.