ఆసియాలో రుణ సంక్షోభ ఛాయలు: మెకెన్సీ అండ్‌ కో

| Edited By:

Aug 21, 2019 | 7:14 AM

దాదాపు 20 ఏళ్ల క్రితం రుణ సంక్షోభం తర్వాత మళ్లీ ఆసియా మార్కెట్లలో సంక్షోభ లక్షణాలు కనిపిస్తున్నాయని ప్రముఖ కన్సల్టెంగ్‌ ఏజెన్సీ మెకెన్సీ అండ్‌ కో పేర్కొంది. అప్పులు పెరిగిపోవడం, రుణ చెల్లింపులు తగ్గిపోవడం, రుణదాతలు సంక్షోభంలో ఉండటం, ఎన్‌బీఎఫ్‌సీల పరిస్థితి ఇబ్బందికరంగా మారడం ఆందోళనలను పెంచుతోందని పేర్కొంది. కొత్త సంక్షోభం సృష్టించడానికి అవసరమైన ఒత్తిడి మార్కెట్‌పై ఉందని జయదీప్‌ సేన్‌ గుప్తా, అర్చనా శేషాద్రి నాథన్‌లు పేర్కొన్నారు. ఇప్పటికే ప్రపంచ ఆర్థిక మందగమనంతో ఆసియా మార్కెట్లలోని […]

ఆసియాలో రుణ సంక్షోభ ఛాయలు: మెకెన్సీ అండ్‌ కో
Follow us on

దాదాపు 20 ఏళ్ల క్రితం రుణ సంక్షోభం తర్వాత మళ్లీ ఆసియా మార్కెట్లలో సంక్షోభ లక్షణాలు కనిపిస్తున్నాయని ప్రముఖ కన్సల్టెంగ్‌ ఏజెన్సీ మెకెన్సీ అండ్‌ కో పేర్కొంది. అప్పులు పెరిగిపోవడం, రుణ చెల్లింపులు తగ్గిపోవడం, రుణదాతలు సంక్షోభంలో ఉండటం, ఎన్‌బీఎఫ్‌సీల పరిస్థితి ఇబ్బందికరంగా మారడం ఆందోళనలను పెంచుతోందని పేర్కొంది. కొత్త సంక్షోభం సృష్టించడానికి అవసరమైన ఒత్తిడి మార్కెట్‌పై ఉందని జయదీప్‌ సేన్‌ గుప్తా, అర్చనా శేషాద్రి నాథన్‌లు పేర్కొన్నారు.

ఇప్పటికే ప్రపంచ ఆర్థిక మందగమనంతో ఆసియా మార్కెట్లలోని కంపెనీ ఒత్తిడిలో ఉన్నాయి. దీనికి తోడు చైనా-అమెరికా ట్రేడ్‌వార్‌ కొనసాగుతోంది. ఆసియా మార్కెట్లు ఎక్కువగా పరపతి విధాన నిర్ణయాలతో వీటిని ఎదుర్కొ వచ్చని మూడీస్‌ చెబుతోంది. మెకన్సీ లెక్కల ప్రకారం ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలోని మొత్తం 23వేల కంపెనీల్లో, ఫండు సంస్థలు తీవ్ర ఆర్థిక ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నాయి. 2007 తర్వాత నుంచి భారత్‌, చైనా వంటి దేశాల్లో ఈ ఒత్తిడి మరింత ఎక్కువైందని పేర్కొంది. అదే సమయంలో అమెరికా, యుకే దేశాల్లో ఈ ఒత్తిడి తగ్గిందని తెలిపింది. 1997లో సంక్షోభం ప్రభుత్వాలు ప్రభుత్వాలు తీసుకున్న ముందస్తు చర్యల వంటివి తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది. లిక్విడిటీ , రుణ చెల్లింపుల్లో, ఎక్స్‌ఛేంజీ రేట్లలో మార్పులు ప్రభుత్వం జాగ్రత్తగా గమనిస్తుండాలని మెకన్సీ సలహా ఇచ్చింది.

మెకెన్సీ గణంకాల ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలోని మొత్తం 23,000 కంపెనీలు, ఫండు సంస్థలు తీవ్ర ఆర్థిక ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నాయి. 2007 తర్వాత నుంచి భారత్‌, చైనా వంటి దేశాల్లో ఈ ఒత్తిడి మరింత ఎక్కువైందని విశ్లేషించింది. ఇదే సమయంలో అమెరికా, బ్రిటన్‌ దేశాల్లో ఈ ఒత్తిడి తగ్గిందని పేర్కొంది. 1997లో సంక్షోభం ప్రభుత్వాలు తీసుకున్న ముందస్తు చర్యల వంటివి తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచించింది. ప్రభుత్వం నగదు లభ్యత, రుణ చెల్లింపుల్లో, మారకం రేట్లను జాగ్రత్తగా గమనిస్తుండాలని పేర్కొంది. త్వరలో ప్రపంచం ఆర్థిక మాంద్యంలోకి జారుతుందని విశ్లేషకులు, పలు అంతర్జాతీయ ఎజెన్సీలు హెచ్చరిస్తున్న విషయం తెలిసిందే.