రాష్ట్రాలకు కేంద్రం వెంటిలేటర్లు, పీపీఈ కిట్లు, మాస్కుల పంపిణీ..

| Edited By:

Jul 03, 2020 | 10:27 PM

కోవిద్-19 విజృంభిస్తోంది. భారత్ లో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. దీని కట్టడి కోసం కేంద్రం పలు చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో ఏప్రిల్ 1 నుంచి కేంద్ర పాలిత ప్రాంతాలు, రాష్ట్రాలు, కేంద్ర సంస్థలకు

రాష్ట్రాలకు కేంద్రం వెంటిలేటర్లు, పీపీఈ కిట్లు, మాస్కుల పంపిణీ..
Follow us on

కోవిద్-19 విజృంభిస్తోంది. భారత్ లో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. దీని కట్టడి కోసం కేంద్రం పలు చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో ఏప్రిల్ 1 నుంచి కేంద్ర పాలిత ప్రాంతాలు, రాష్ట్రాలు, కేంద్ర సంస్థలకు 2 కోట్లకు పైగా ఎన్95 మాస్కులు, 1.18 కోట్ల పీపీఈ కిట్లు, 11,000 వెంటిలేటర్లను ఉచితంగా సరఫరా చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

కోవిద్-19 కట్టడికోసం ఇప్పటికే 11,300 “మేక్ ఇన్ ఇండియా” వెంటిలేటర్లను వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, కేంద్ర సంస్థలకు పంపించినట్లు ప్రభుత్వం తెలిపింది. వీటిలో 6,154 ఇప్పటికే వివిధ ఆస్పత్రులకు పంపించబడ్డాయని పేర్కొంది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం 1.02 లక్షల ఆక్సిజన్ సిలిండర్లను సరఫరా చేస్తోందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

Also Read: ముంబైలో భారీ వర్షాలు.. పురాతన భవనాలకు ముప్పు..