ఢిల్లీలో 2.25 లక్షలమంది హెల్త్ కేర్ వర్కర్లకు ‘తొలిదశ వ్యాక్సిన్లు’, 13 నుంచి మొదలు, ప్రభుత్వ ప్రకటన

| Edited By: Pardhasaradhi Peri

Jan 10, 2021 | 5:34 PM

ఢిల్లీలో తొలిదశలో 2.25 లక్షలమంది హెల్త్ కేర్ వర్కర్లకు వ్యాక్సినేషన్ ప్రక్రియ ఈ నెల 13 నుంచి ప్రారంభమవుతుందని ప్రభుత్వం ప్రకటించింది

ఢిల్లీలో 2.25 లక్షలమంది హెల్త్ కేర్ వర్కర్లకు తొలిదశ వ్యాక్సిన్లు, 13 నుంచి మొదలు, ప్రభుత్వ ప్రకటన
Follow us on

Covid Vaccine: ఢిల్లీలో తొలిదశలో 2.25 లక్షలమంది హెల్త్ కేర్ వర్కర్లకు వ్యాక్సినేషన్ ప్రక్రియ ఈ నెల 13 నుంచి ప్రారంభమవుతుందని ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు 89 సైట్స్ ను ఖరారు చేశామని ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ వెల్లడించారు. 40 కి పైగా ప్రభుత్వ ఆస్పత్రులు, 49 ప్రైవేటు హాస్పిటల్స్ ఒక్కొక్కటి కోవిడ్ వ్యాక్సిన్ సైట్ ను కలిగి ఉంటాయన్నారు. ప్రతి హాస్పిటల్ లో ఓ వ్యాక్సినేషన్ సెంటర్ ఉంటుందని, అలాగే ప్రతి సెంటర్ లో 10 మంది హెల్త్ కేర్ సిబ్బందిని నియమిస్తామని ఆయన చెప్పారు. వ్యాక్సిన్లు అందుబాటులోకి రాగానే ఈ ప్రక్రియ యుధ్ధ ప్రాతిపదికన ప్రారంభమవుతుందని జైన్ పేర్కొన్నారు.

ఢిల్లీ నగరంలో కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పడుతున్న తరుణంలో ప్రభుత్వం వీటిని మరింతగా నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటోంది.

 

Also Read :

బ్యాచిలర్లూ తస్మాత్ జాగ్రత్త! ఆ వ్యాధి ముప్పు అధికమేనట.. హెచ్చరిస్తున్న పరిశోధకులు..

ఐపీఎల్ 2021 మినీ వేలం.. చెన్నై సూపర్ కింగ్స్ విడిచిపెట్టే ప్లేయర్స్ జాబితా ఇదే.!

చికెన్ తింటే బర్డ్ ప్లూ వ్యాధి సోకుతుందనే వదంతులు.. ఆంధ్రప్రదేశ్‌లోని పౌల్ట్రీ రైతుల్లో కొత్త ఆందోళన