కరోనా ఎఫెక్ట్: 24 గంటల్లో 1,000 కి పైగా పాజిటివ్ కేసులు, 40 మంది మృతి

| Edited By:

Apr 11, 2020 | 7:17 PM

కరోనా కరాళ నృత్యానికి ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఈ వైరస్ ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1000కి పైగా కేసులు నమోదయ్యాయి. దేశంలోకి కరోనా ప్రవేశించిన తరువాత

కరోనా ఎఫెక్ట్: 24 గంటల్లో 1,000 కి పైగా పాజిటివ్ కేసులు, 40 మంది మృతి
Follow us on

కరోనా కరాళ నృత్యానికి ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఈ వైరస్ ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1000కి పైగా కేసులు నమోదయ్యాయి. దేశంలోకి కరోనా ప్రవేశించిన తరువాత ఒక్కరోజులో ఇన్ని కేసులు నమోదవడం ఇదే తొలిసారి. దీనిపై కుటుంబ, ఆరోగ్య సంక్షేమ శాఖ అదనపు కార్యదర్శి లవ్ అగర్వాల్ మాట్లాడుతూ, ‘దేశంలో ఈ స్థాయిలో కరోనా కేసులు నమోదవడం ఇదే తొలిసారి. ఒక్కరోజులో 1035 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా కరోనా కారణంగా 40 మంది మృతిచెందారు’ అని అగర్వాల్ తెలిపారు. ఇదిలా ఉంటే 642 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని ఆయన చెప్పారు.

కాగా.. ఢిల్లీలో కరోనా బాధితుల సంఖ్య 903కి చేరగా 13మంది మరణించారు. మొత్తం బాధితుల్లో 450మంది తబ్లిగీలకు సంబంధించినవారే ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. శనివారంనాటికి దేశవ్యాప్తంగా కరోనా సోకి 239మంది మరణించగా మొత్తం 7447మంది దీని బారినపడ్డారు. గడచిన 24గంటల్లోనే దేశంలో కొత్తగా 40మరణాలు, 1035కేసులు నమోదయ్యాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా 16లక్షల మందికి ఈ వైరస్‌ నిర్ధారణ అయ్యింది. వీరిలో లక్షమంది మృతిచెందారు.

Also Read: కరోనా నుంచి కిరాణా సామాన్లకు రక్షణ.. వైరస్ కు అడ్డుకట్ట..!