థియేటర్లు బంద్.. ఓటీటీల హవా..

| Edited By:

Apr 19, 2020 | 2:02 PM

కోవిద్-19 విజృంభణ.. లాక్ డౌన్ పొడిగింపు.. సామాజిక దూరం.. ఏదైతేనేం థియేటర్లు బంద్ అయ్యాయి. కానీ జనాలు ఓటీటీల పుణ్యమా అని కొత్త కొత్త సినిమాలు చూస్తున్నారు. ఇప్పుడు ఆడియన్స్ ఎక్కువగా ఓటీటీల వైపు

థియేటర్లు బంద్.. ఓటీటీల హవా..
Follow us on

కోవిద్-19 విజృంభణ.. లాక్ డౌన్ పొడిగింపు.. సామాజిక దూరం.. ఏదైతేనేం థియేటర్లు బంద్ అయ్యాయి. కానీ జనాలు ఓటీటీల పుణ్యమా అని కొత్త కొత్త సినిమాలు చూస్తున్నారు. ఇప్పుడు ఆడియన్స్ ఎక్కువగా ఓటీటీల వైపు చూస్తున్నారు. ఇప్పటికే టికెట్ల రేట్లు కామన్ ఆడియన్ కు భారంగా మారాయి.. దాంతో కరోనా ఎఫెక్ట్ తో టికెట్ రేట్లు పెరిగితే సామాన్యుడు థియేటర్ కు దూరం అయినట్టె. అదే అవకాశాన్ని క్యాష్ చేసుకుంటున్నాయి ఓటీటీలు.

గత కొద్ది కాలంగా.. డిజిటల్ ప్లాట్ ఫామ్ ప్రభావం ఆడియన్స్ మీద ఎక్కువగా కనిపిస్తోంది. అందులోనూ లాక్ డౌన్ కారణంగా థియేటర్లు మూత పడటంతో.. ఓటీటీల హడావిడి ఇంకా పెరిగిపోయింది.అందులోనూ ఆహా లాంటి కొత్త కొత్త డిజిటల్ ప్లాట్ ఫామ్స్ మార్కెట్ లోకి రావడంతో.. జనాలు ఇప్పుడు వాటిని ఎగబడి చూస్తున్నారు. అంతే కాదు లాక్ డౌన్ తో ఇంట్లో ఉన్న వారికోసం స్పెషల్ ప్యాక్ లు.. కొత్త కొత్త కంటెంట్ లో ఆడియన్స్ ను బాగా ఎట్రాక్ట్ చేస్తున్నాయి ఓటీటీలు. లాక్ డౌన్ తరువాత కూడా ఇవి థియేటర్లకు శాపంగా మారే అవకాశం కనిపిస్తోంది.