ఇక 12 రాష్ట్రాల్లో ఎక్కడైనా రేషన్..ఏపీ, తెలంగాణకు వర్తింపు

|

Jan 09, 2020 | 12:06 PM

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంచలన పథకం ‘ఒకే దేశం- ఒకే రేషన్ కార్డు’ పథకం దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఆయా 12 రాష్ట్రాల్లో  రేషన్ కార్డు ఉన్న పేదవారు ఎక్కడైనా సరుకులు పొందవచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, త్రిపుర, జార్కండ్, గుజరాత్, మహరాష్ట్ర, హరియాణ, కేరళ, గోవా, రాజస్తాన్, కర్నాటక  రాష్ట్రాల్లో ఈ స్కీమ్ అమల్లోకి వచ్చిందని కేంద్ర పౌర సరఫరాల శాఖ మంత్రి రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ స్పష్టం చేశారు. […]

ఇక 12 రాష్ట్రాల్లో ఎక్కడైనా రేషన్..ఏపీ, తెలంగాణకు వర్తింపు
Follow us on

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంచలన పథకం ‘ఒకే దేశం- ఒకే రేషన్ కార్డు’ పథకం దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఆయా 12 రాష్ట్రాల్లో  రేషన్ కార్డు ఉన్న పేదవారు ఎక్కడైనా సరుకులు పొందవచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, త్రిపుర, జార్కండ్, గుజరాత్, మహరాష్ట్ర, హరియాణ, కేరళ, గోవా, రాజస్తాన్, కర్నాటక  రాష్ట్రాల్లో ఈ స్కీమ్ అమల్లోకి వచ్చిందని కేంద్ర పౌర సరఫరాల శాఖ మంత్రి రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ స్పష్టం చేశారు. ఈ పథకం అమలు చేస్తోన్న రాష్ట్రాలకు కేంద్రం కొన్ని గైడ్‌లైన్స్ విడుదల చేసింది. ప్రస్తుతం పాత రేషన్ కార్డుల ద్వారానే ఈ స్కీమ్ వర్తిస్తోంది. త్వరలో అన్ని రాష్ట్రాల్లో ఉన్న పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ లబ్ధిదారుల కార్డులన్నీ ఒకే రకంగా ఉండేలా  ప్రభుత్వం మార్గదర్శకాలు సిద్దం చేస్తోంది. ఈపీఎస్(ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్) పరికరాలు ఉన్న రేషన్ దుకాణాల్లోనే ఈ స్కీమ్ అమలు సాధ్యమవుతుంది.  ఆధార్ లేదా బయోమెట్రిక్స్ నమోదు చేసుకున్నవారికే ఇంటర్ స్టేట్ పోర్టబిలిటీని పొందగలరు. ఫేక్ రేషన్ కార్డులను తగ్గించేందుకు, ఇతర ప్రాంతాలకు జీవనోపాధి నిమిత్తం వలసవెళ్లే పేదవారు, కూలీలు కోసం కేంద్ర ప్రభుత్వం గతేడాది డిసెంబర్ 3న ‘వన్ నేషన్ వన్ రేషన్ కార్డు’ పథకానికి అంకురార్పణ చేసింది.