Huge investment: ఏపీకి బంపర్ ఆఫర్..12 వేల కోట్లతో ఐఎంఆర్!

|

Mar 05, 2020 | 4:46 PM

ఏపీలో మరో భారీ ఉక్కు కర్మాగారం రాబోతోంది. అది కూడా ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లా కడపలో ఏర్పాటు కాబోతోంది. అంతర్జాతీయ సంస్థ అయితన ఐఎంఆర్ పన్నెండు వేల కోట్ల రూపాయల పెట్టుబడికి ముందుకు రావడంతో...

Huge investment: ఏపీకి బంపర్ ఆఫర్..12 వేల కోట్లతో ఐఎంఆర్!
Follow us on

IMR group to invest 12K Cr in Andhra Pradesh: ఏపీలో మరో భారీ ఉక్కు కర్మాగారం రాబోతోంది. అది కూడా ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లా కడపలో ఏర్పాటు కాబోతోంది. అంతర్జాతీయ సంస్థ అయితన ఐఎంఆర్ పన్నెండు వేల కోట్ల రూపాయల పెట్టుబడికి ముందుకు రావడంతో కడప జిల్లాలో రెండో ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు రంగం సిద్దమవుతోంది. ఈ మేరకు ఐఎంఆర్ ప్రతినిధి బృందం గురువారం నాడు ముఖ్యమంత్రి జగన్‌తో సమాలోచనలు జరిపింది.

వైఎస్సార్ కడప జిల్లాలో మరో భారీ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ఐఎంఆర్ సంస్థ ముందుకు వచ్చింది. అంతర్జాతీయ సంస్థ అయిన ఐఎంఆర్ సంస్థ కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం కోసం పన్నెండు వేల కోట్ల రూపాయల పెట్టుబడితో ప్రతిపాదనలు ప్రభుత్వం ముందుంచింది. ఈ ప్రతిపాదనలతో ఐఎంఆర్ బృందం ముఖ్యమంత్రి జగన్‌తో భేటీ అయ్యింది. ఏడాదికి 10 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి లక్ష్యంతో సుమారు 12 వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతామని ఐఎంఆర్ ప్రతినిధులు ఏపీ ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని సీఎం ఐఎంఆర్ ప్రతినిధులకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.