బాలకృష్ణ, బోయపాటి సినిమాలో ఇద్దరు విలన్లు!

| Edited By: Anil kumar poka

May 14, 2020 | 1:17 PM

నట సింహం నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో రానున్న కొత్త సినిమాలో ఇద్దరు విలన్లు ఉండబోతున్నారట. ఇప్పటికే ఓ పాత్రకు శ్రీకాంత్‌ను ఎంపిక చేయగా.. మరొకరి కోసం చిత్రబృందం పరిశీలిస్తుంది. ఈ చిత్రంలో బాలకృష్ణ రెండు కోణాల్లో సాగే పాత్రలో..

బాలకృష్ణ, బోయపాటి సినిమాలో ఇద్దరు విలన్లు!
Follow us on

నట సింహం నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో రానున్న కొత్త సినిమాలో ఇద్దరు విలన్లు ఉండబోతున్నారట. ఇప్పటికే ఓ పాత్రకు శ్రీకాంత్‌ను ఎంపిక చేయగా.. మరొకరి కోసం చిత్రబృందం పరిశీలిస్తుంది. ఈ చిత్రంలో బాలకృష్ణ రెండు కోణాల్లో సాగే పాత్రలో కనిపించనున్నారు. ద్వారక క్రియేషన్స్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే బాలయ్య రెండు పాత్రల్లో నటిస్తున్నారని దర్శకుడు బోయపాటి క్లారిటీ ఇచ్చేశారు. ఒకటి అఘోరా పాత్ర కాగా.. మరొకటి ఫ్యాక్షనిస్ట్ రోల్.

కాగా బాలకృష్ణ శైలికి తగ్గట్టుగా ఓ శక్తిమంతమైన కథని సిద్ధం చేశారు దర్శకుడు బోయపాటి. ఈ చిత్రంలోని ఒక విలన్ రోల్‌కి నటుడు శ్రీకాంత్‌ని సెలెక్ట్ చేయగా.. మరో ప్రధాన ప్రతినాయక పాత్ర కోసం ఓ బాలీవుడ్ నటుడిని తీసుకోవాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా తొందర్లోనే ఈ సినిమాలో నటించబోయే హీరోయిన్‌ను కూడా ప్రకటిస్తామని డైరెక్టర్ బోయపాటి శ్రీను చెప్పుకొచ్చారు. కాగా వారణాసిలో కీలక సన్నివేశాల్ని తెరకెక్కించబోతున్నామని, లాక్‌డౌన్ ముగిసిన తర్వాత ఈ చిత్రీకరణ ప్రారంభిస్తామని బోయపాటి తెలిపారు.

Read More:

కరెంట్ బిల్లులపై మరో కీలక నిర్ణయం తీసుకున్న సీఎం జగన్

లాక్‌డౌన్‌లో సింపుల్‌గా హీరో నిఖిల్ పెళ్లి..

బస్సుల్లో మారిన సీట్లు.. ఏపీఎస్‌ఆర్టీసీ‌లో కొత్త మోడల్