టాలీవుడ్‌లోకి హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న మరో మెగా అల్లుడు.. కల్యాణ్ దేవ్ దారిలోనే అతను కూడా.

|

Dec 20, 2020 | 7:29 PM

మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో ఇండస్ట్రీ ఎంట్రీ ఇవ్వనున్నాడా? ఇందుకోసం ఇప్పటికే రంగం సిద్ధమవుతోందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. తాజాగా వినిపిస్తోన్న సమాచారం మేరకు నిహారిక భర్త చైతన్య కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడనే వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

టాలీవుడ్‌లోకి హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న మరో మెగా అల్లుడు.. కల్యాణ్ దేవ్ దారిలోనే అతను కూడా.
Follow us on

One more hero from mega family: మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో ఇండస్ట్రీ ఎంట్రీ ఇవ్వనున్నాడా? ఇందుకోసం ఇప్పటికే రంగం సిద్ధమవుతోందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. మెగాస్టార్ చిరంజీవి నటన వారసులుగా ఇప్పటి వరకు ఎంతో మంది హీరోలు తెలుగు ప్రేక్షకులను పలకరించారు. నాగబాబు కూతురు నిహారిక కూడా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల నిహారిక వెండితెరపై పెద్దగా కనిపించడంలేదు. ఈ మెగా డాటర్ ఇటీవలే చైతన్యను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.
తాజాగా వినిపిస్తోన్న సమాచారం మేరకు నిహారిక భర్త చైతన్య కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడనే వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. అయితే మెగా కుటుంబానికి చెందిన వారు కాకుండా వేరే నిర్మాణ సంస్థ చైతన్యను హీరోగా పరిచయం చేయనుందని సదరు వార్త సారంశం. మరి ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఎదురు చూడాలి. ఇక మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కల్యాణ్ దేవ్ కూడా మెగా కుటుంబం అండతోనే హీరోగా మారిన విషయం తెలిసిందే. దీంతో మరో అల్లుడు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నాడని చర్చ జరుగుతోంది.