Breaking News మరో భారీ నజరానా ప్రకటించిన కేంద్రం

|

May 20, 2020 | 3:25 PM

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆయన నివాసంలో బుధవారం సమావేశమైన కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. మరో భారీ ఆర్థిక ప్యాకేజీకి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.

Breaking News మరో భారీ నజరానా ప్రకటించిన కేంద్రం
Follow us on

Union cabinet approved one more huge allocation to MSMEs: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆయన నివాసంలో బుధవారం సమావేశమైన కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. మరో భారీ ఆర్థిక ప్యాకేజీకి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. మూడు లక్షల కోట్ల ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్‌కు మోదీ మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.

బుధవారం సుమారు నాలుగు గంటలపాటు పాటు మోదీ సారథ్యంలో కేంద్ర మంత్రివర్గం సమావేశమైంది. ఆత్మ నిర్బర్ ప్యాకేజీకి ఆమోదం తెలిపిన కేంద్ర క్యాబినెట్.. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. క్రెడిట్ గ్యారంటీ స్కీమ్‌లో మార్పులు, మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్, పీఎం వాయ వందన యోజన, ఎన్.బి.ఎఫ్.సి.లకు స్పెషల్ లిక్విడిటీ పథకాలను కేంద్ర కేబినెట్ ఆమోదించింది.

బొగ్గు గనుల వేలానికి సంబంధించి నూతన విధానాన్ని మోదీ మంత్రివర్గం ఓకే చేసేసింది. దీంతో ఇటీవల ప్రకటించిన బొగ్గు గనుల ప్రైవేటీకరణకు లైన్ క్లియర్ అయ్యింది. హిందుస్థాన్ ఆర్గానిక్ కెమికల్స్ లిమిటెడ్ మాఫీకి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇటీవల నిర్మలా సీతారమన్ వరుసగా వెల్లడించిన ఆర్థిక ప్యాకేజీలపై విపక్షాలు, ఆర్థిక వేత్తల కామెంట్లపై కేంద్ర కేబినెట్ చర్చించినట్లు తెలుస్తోంది.

మే 31వ తేదీన ముగియనున్న నాలుగో విడత లాక్ డౌన్ తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై కూడా మోదీ కేబినెట్ చర్చించింది. అయితే, ఆనాటి పరిస్థితికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని, ముందుగా ప్రజల ఆర్థిక పరిస్థితిని సాధారణ స్థితికి తేవడానికి చర్యలు చేపట్టాలని కేబినెట్ భావించినట్లు సమాచారం. వలస కూలీల తరలింపులో ఎదురవుతున్న సవాళ్ళపై రాష్ట్రాలను అప్రమత్తం చేయాలని కేబినెట్ హోం శాఖకు నిర్దేశించినట్లు తెలుస్తోంది.