ఆశాజనక ఫలితాలిస్తోన్న రెమ్డిసివిర్.. ప్రతి ముగ్గురిలో ఒకరు..

| Edited By:

Jul 14, 2020 | 7:03 AM

దేశంలో కోవిద్-19 కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ క్రమంలో దక్షిణ కొరియాలో కరోనా రోగులకు చికిత్సలో భాగంగా అందిస్తున్న యాంటీ వైరల్ డ్రగ్ రెమ్డిసివిర్

ఆశాజనక ఫలితాలిస్తోన్న రెమ్డిసివిర్.. ప్రతి ముగ్గురిలో ఒకరు..
Follow us on

దేశంలో కోవిద్-19 కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ క్రమంలో దక్షిణ కొరియాలో కరోనా రోగులకు చికిత్సలో భాగంగా అందిస్తున్న యాంటీ వైరల్ డ్రగ్ రెమ్డిసివిర్ ఆశాజనకమైన ఫలితాలనిస్తోంది. ప్రతి ముగ్గురిలో ఒకరు ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడుతున్నట్లు అక్కడి హెల్త్ అథారిటీస్ స్పష్టం చేశాయి. అయితే.. ఇది కేవలం రెమ్డిసివిర్ వల్లనేనా లేక రోగుల రోగ నిరోధక శక్తి, ఇతర కారణాల వల్ల కోలుకుంటున్నారా అనే అంశంపై మరింత పరిశోధన చేయాల్సిన అవసరం ఉందని తెలిపాయి.

కరోనా ఔషధం రెమ్డిసివిర్ పనితీరుకు సంబంధించి ‘ది కొరియా సెంటర్స్ ఫర్ డిసీస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్’ (కేసీడీసీ) శనివారం కీలక విషయాన్ని బయటపెట్టింది. కొరియాలో కరోనా సోకి పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న 27 మందికి రెమ్డిసివిర్‌ను ఇంజక్ట్ చేశామని, ఈ 27 మందిలో 9 మంది ఆరోగ్య పరిస్థితి రెమ్డిసివిర్ ఇచ్చిన తర్వాత మెరుగైందని స్పష్టం చేసింది. 15 మందిలో ఎలాంటి మార్పు కనిపించలేదని కేసీడీసీ తెలిపింది.