కరోనా సోకిన వ్యక్తి లాక్‌డౌన్ పాటించకపోతే.. ఏం జరుగుతుందంటే..

| Edited By:

Apr 07, 2020 | 6:06 PM

కోవిద్ 19 దెబ్బకు ప్రపంచ దేశాలన్నీ అతలాకుతలమయ్యాయి. ఈ వైరస్ ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. కరోనా సోకిన వ్యక్తి లాక్‌డౌన్‌ను, భౌతిక దూరాన్ని పాటించకపోతే ఆ వ్యక్తి నుంచి నెల రోజుల వ్యవధిలో

కరోనా సోకిన వ్యక్తి లాక్‌డౌన్ పాటించకపోతే.. ఏం జరుగుతుందంటే..
Follow us on

కోవిద్ 19 దెబ్బకు ప్రపంచ దేశాలన్నీ అతలాకుతలమయ్యాయి. ఈ వైరస్ ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. కరోనా సోకిన వ్యక్తి లాక్‌డౌన్‌ను, భౌతిక దూరాన్ని పాటించకపోతే ఆ వ్యక్తి నుంచి నెల రోజుల వ్యవధిలో 406 మందికి వైరస్ సోకే అవకాశముందని ఐసీఎమ్‌ఆర్ అధ్యయనంలో వెల్లడైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. లాక్‌డౌన్‌ను ప్రజలంతా స్వచ్ఛందంగా పాటించాలని, భౌతిక దూరాన్ని తప్పనిసరిగా అలవాటు చేసుకోవాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ ప్రజలకు సూచించారు.

కాగా.. గత 24 గంటల్లో భారత్‌లో 354 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు ఆయన తెలిపారు. దీంతో.. భారత్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4421కి చేరినట్లు ఆయన తెలిపారు. 24 గంటల్లో 8 మంది కరోనా బారిన పడి మరణించినట్లు లవ్ అగర్వాల్ స్పష్టంచేశారు.